సచివాలయ ముట్టడికి యత్నించిన భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌తో పాటు పలువురు పార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. నూతన సచివాలయ భవనాల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ కమలం పార్టీ ముట్టడికి పిలుపునిచ్చింది. అదుపులోకి తీసుకున్న వారిని ముషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ప్రజా ధనం వృథా...
సీఎం కేసీఆర్ ఆరువందల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. ఎన్టీఆర్ కట్టించిన నిర్మాణాలు ఇప్పటికీ చెక్కు చెదరలేదని అన్నారు. పేదల కోసం రెండు లక్షల ఇళ్లు కట్టించి ఇస్తామన్న ముఖ్యమంత్రి... 20 వేల ఇళ్లు కూడా కట్టలేదని దుయ్యబట్టారు.
ఇదీ చూడండి : సచివాలయం, అసెంబ్లీ భవనాలకు భూమి పూజ