ETV Bharat / state

ఆర్టీసీ బస్సులపై గుట్కా యాడ్స్​.. మండిపడ్డ రాజాసింగ్​ ​ - ప్రభుత్వం నిషేధిత పదార్థాలు

ఓ వైపు గుట్కా విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెబుతూనే.. ప్రభుత్వం నిషేధిత పదార్థాలకు ప్రచారం నిర్వహిస్తోందని భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. బస్సులపై గుట్కా ప్రకటనలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.

bjp mla Rajasingh fires on govt Gutka ads on RTC buses ..
ఆర్టీసీ బస్సులపై గుట్కా యాడ్స్​.. మండిపడ్డ రాజాసింగ్​ ​
author img

By

Published : Feb 18, 2021, 12:07 PM IST

డబ్బుల కోసం ప్రభుత్వం.. ఆర్టీసీ బస్సులపై గుట్కా పాన్ మసాలా ప్యాకెట్ల ప్రచారం నిర్వహిస్తోందంటూ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. ఆరోగ్యానికి హాని కలిగించే పదార్థాలను ప్రోత్సహించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.

ఓ వైపు గుట్కా విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెబుతూనే.. నిషేధిత పదార్థాలకు ప్రచారం నిర్వహిస్తోందంటూ ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే. హానికరమని తెలిసినా.. ప్రకటనలు ఎందుకు చేస్తున్నారంటూ సీఎం, ఆరోగ్యశాఖ మంత్రులను నిలదీశారు. తక్షణమే ప్రకటనలను తొలగించాలని డిమాండ్ చేశారు. గుట్కా తయారీ, విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఇదీ చదవండి: న్యాయవాద దంపతుల హత్యకు... వాధించిన కేసులే కారణమా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.