ETV Bharat / state

Raghunandan Rao: ' మంత్రి నిరంజన్‌ రెడ్డిపై ఈడీకి ఫిర్యాదు చేస్తా'

Raghunandan Rao Fires on Niranjan Reddy: మంత్రి నిరంజన్​రెడ్డిపై ఈడీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తానని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​రావు అన్నారు. మంత్రి సూటిగా కాకుండా అనేక విషయాలను దాటవేస్తున్నారని అన్నారు. చైనా పౌరుడితో మంత్రి తరచూ మట్లాడారని దీనికి సంబంధించి దర్యాప్తు చేయాలని ఈడీని కోరతానని చెప్పారు. ఆయన పొలం, ఇల్లు రూ.4 కోట్లకే అమ్ముతానంటే కొంటానని పేర్కొన్నారు.

Raghunandan Rao
Raghunandan Rao
author img

By

Published : Apr 24, 2023, 1:34 PM IST

Raghunandan Rao: 'నిరంజన్‌రెడ్డిపై ఈడీకి ఫిర్యాదు చేస్తా'

Raghunandan Rao Fires on Niranjan Reddy: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిపై ఈడీకి ఫిర్యాదు చేస్తానని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్​రావు చెప్పారు. ఫామ్‌హౌస్‌ భూమికి సంబంధించి అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలకు నిరంజన్‌రెడ్డి వివరణపై రఘనందన్​రావు మాట్లాడారు. మంత్రి నిరంజన్‌ రెడ్డి సూటిగా కాకుండా అనేక విషయాలను దాటవేశారని అన్నారు. ఆర్డీవో కార్యాలయంలో దస్త్రాలుంటే రైతులకు ఎందుకు పహానీలు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. చైనా పౌరుడితో నిరంజన్‌రెడ్డి తరచూ మాట్లాడారని.. చైనా వాసి 'మో' వ్యవహారాలపై దర్యాప్తు చేయాలని ఈడీని కోరతానని తెలిపారు. మంత్రి దత్తపుత్రుడు గౌడ్‌ నాయక్‌పై ఐటీ అధికారులకు ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు.

Raghunandan Rao comments on Niranjan Reddy: అగ్రికల్చర్ వర్సిటీ వీసీగా నిరంజన్ రెడ్డి తన వియ్యంకుడిని నియమించారని రఘునందన్ రావు ఆరోపించారు. మంత్రి పొలం, ఇల్లు రూ.4 కోట్లకే అమ్ముతానంటే కొంటానని అన్నారు. ఆయన భూమి వరకు 3 కిలో మీటర్లు సీసీ రోడ్డు వేశారని విమర్శించారు. ఈ సీసీ రోడ్డును రైతులతో కలిసి వేసుకున్నట్లు మంత్రి చెప్పారని తెలిపారు. రూ.5 కోట్ల ఖర్చు అయ్యే సీసీ రోడ్డును రైతులు చందాలు వేసుకుని నిర్మించారా? అని రఘనందన్​రావు ప్రశ్నించారు. ప్రభుత్వ కాంట్రాక్టులన్నీ దత్తపుత్రుడికి అప్పగిస్తున్నారని ఆరోపణలు చేశారు. చైనాకు చెందిన మో అనే వ్యక్తితో మంత్రి నిరంజన్‌రెడ్డికి సంబంధం ఏమిటి? చెప్పాలని పేర్కొన్నారు. చైనా వ్యక్తికి మంత్రి నిరంజన్​రెడ్డి అన్నిసార్లు ఎందుకు ఫోన్‌ చేస్తున్నారని నిలదీశారు.

'మంత్రి నిరంజన్‌రెడ్డిపై ఈడీకి ఫిర్యాదు చేస్తా. చైనా పౌరుడితో నిరంజన్‌రెడ్డి తరచూ మాట్లాడారు. చైనా వాసి 'మో'తో మంత్రి లావావాదేవీలపై దర్యాప్తు జరగాలి. ప్రభుత్వ కాంట్రాక్టులన్నీ దత్తపుత్రుడికి ఎలా దక్కాయి. అగ్రికల్చర్ వర్సిటీ వీసీగా వియ్యంకుడిని నియమించారు. మంత్రి పొలం, ఇల్లు రూ.4 కోట్లకే అమ్ముతానంటే కొంటాను'. -రఘునందన్​రావు, బీజేపీ ఎమ్మెల్యే

నిరూపిస్తే రాజీనామా చేస్తా: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్​రావు చేసిన ఆరోపణలను నిన్న మంత్రి నిరంజన్​రెడ్డి తిప్పికొట్టారు. తాను భూ అక్రమాలకు పాల్పడినట్లు చుట్టుపక్కల రైతులు ఒక్కరు చెప్పినా మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్‌ విసిరారు. రఘునందన్‌రావు చేసిన ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని... అయన ఎప్పుడూ వచ్చినా గట్టుకాడిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రమాణం చేయడానికి సిద్దమేనని స్పష్టం చేశారు. ఆరోపణలు దురుద్దేశ పూర్వకం కాకపోతే వెంటనే స్పందించాలని దుబ్బాక ఎమ్మెల్యేను ఉద్దేశించి అన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.