ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌పై వేసిన రిట్ పిటిషన్ ఐదేళ్లు గడుస్తున్నా.... హైకోర్టు బెంచ్ ముందుకు ఎందుకు రావడం లేదని భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రశ్నించారు. విచారణకు రాకుండా తొక్కి పెడుతున్నది ఎవరు... చీఫ్ జస్టిస్ ముందుకు రాకుండా ఎందుకు ఆగిందో తెలియాలన్నారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరగాలని కోరుతూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రాశారు.
'' సీఎస్‌పై వేసిన రిట్ పిటిషన్ బెంచ్ ముందుకు ఎందుకు రావట్లేదు. ఐదేళ్లు గడుస్తున్నా హైకోర్టు బెంచ్ ముందుకు ఎందుకు రావట్లేదు. రిట్ పిటిషన్ విచారణకు రాకుండా తొక్కిపెడుతున్నది ఎవరు? ఈ విషయంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రమణకు లేఖ రాశాను.''
- రఘునందన్‌రావు, భాజపా ఎమ్మెల్యే
సోమేశ్ కుమార్ నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన అధికారి అని రఘునందన్‌రావు తెలిపారు. ఆయనతో పాటు మరో 12 మంది అధికారులు కూడా ఆంధ్రకు కేటాయించిన అధికారులేనని వారంతా... నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణలో కొనసాగుతున్నారని అన్నారు.
- ఇదీ చదవండి : అందుకే భాజపా ఎమ్మెల్యేల సస్పెన్షన్: హరీశ్‌రావు