ETV Bharat / state

'2009లో బీటెక్​ చేసిన రోహిత్​ రెడ్డి.. 2014లో ఇంటర్​ చదివాడా?'

Raghunandan fire on Pilot Rohit Reddy: టీఆర్​ఎస్​ ఎమ్మెల్యే పైలెట్​ రోహిత్​ రెడ్డి విద్యార్హతలపై పలు అనుమానాలు ఉన్నట్లు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​ ఆరోపించారు. 'రోహిత్​రెడ్డి 2009 ఎన్నికల అఫిడవిట్‌లో బీటెక్ చదివినట్లు, అలాగే 2014 ఎన్నికల అఫిడవిట్‌లో మాత్రం ఇంటర్ చదివినట్టు పేర్కొన్నారు. అంటే 2009లో ఇంజినీరింగ్.. 2014లో ఇంటర్ చేస్తారా'? అని ప్రశ్నించారు. దీనిపై ఈసీకు ఫిర్యాదు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

BJP MLA Raghunandan
BJP MLA Raghunandan
author img

By

Published : Dec 17, 2022, 8:35 PM IST

Raghunandan fire on Pilot Rohit Reddy: టీఆర్​ఎస్​ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి విద్యార్హతలపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఆయన 2009 ఎన్నికల అఫిడవిట్​లో బీటెక్ (ఎంఎస్) స్వీడన్​లో పూర్తి చేసినట్లు పేర్కొన్నారనీ.. 2014 ఎన్నికల అఫిడవిట్​లో మాత్రం ఇంటర్మీడియట్ చదివినట్లు ఉందని అనుమానం వ్యక్తం చేశారు. 'అంటే 2009లో ఇంజినీరింగ్ చేసిన వ్యక్తి.. మళ్లీ 2014లో ఇంటర్ చేస్తాడా' అని ప్రశ్నించారు. ఈడీ అధికారులు అందుకే ఆయన బయోడేటా తెమ్మన్నారని ఎద్దేవా చేశారు.

ఎన్నికల అఫిడవిట్​లో తప్పుడు సమాచారం ఇస్తే అధికారులు కేసులు నమోదు చేస్తారన్నారు. భారత ఎన్నికల సంఘానికి రోహిత్ రెడ్డి విద్యార్హత మీద ఫిర్యాదు చేస్తున్నట్లు రఘునందన్​ పేర్కొన్నారు. ఈడీ కేసును వేగవంతం చేయాలని బండి సంజయ్​ సూచినట్లు హరీశ్​రావు అన్న వ్యాఖ్యలపై రఘునందన్​ స్పందించారు. ఈడీ గురించి బండి సంజయ్ వ్యాఖ్యానించిన ప్రెస్ మీట్ చూసి హరీశ్​రావు మాట్లాడాలనీ హితవు పలికారు. హరీశ్​రావు ఎమ్మెల్యే కాకముందే అడ్డదారిలో మంత్రి అయ్యారని విమర్శించారు.

బండి సంజయ్​ గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదని ధ్వజమెత్తారు. రోహిత్ రెడ్డికి సంబంధించిన మొయినాబాద్ ఫాంహౌజ్.. దళితుల అసైన్డ్​ భూమిలో ఉందా? లేదా? చెప్పాలని డిమాండ్ చేశారు. రోహిత్ రెడ్డికి నందు, సింహయాజీలతో అనేక రోజులుగా వ్యాపార లావాదేవీలు ఉన్నట్లు ఆయన ఆరోపించారు. ఆ ముగ్గురికి సంబంధించిన కాల్​డేటా బయటికి తీస్తే అన్నీ నిజాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు.

"2009 అఫిడవిట్‌లో రోహిత్‌ బీటెక్ చదివినట్లు పేర్కొన్నారు. 2014లో మాత్రం ఇంటర్ చదివినట్టు వెల్లడించారు.
2009లో ఇంజినీరింగ్ చేసి.. 2014 ఇంటర్ చేస్తారా? అధికారులు రోహిత్‌రెడ్డి బయోడేటా అడగడానికి కారణం ఇదే.. అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇస్తే కేసులు నమోదు చేస్తారు. రోహిత్‌రెడ్డి విద్యార్హతపై ఈసీకి ఫిర్యాదు చేస్తున్నా..- రఘునందన్‌రావు, దుబ్బాక ఎమ్మెల్యే

'2009లో బీటెక్​ చేసిన రోహిత్​ రెడ్డి.. 2014లో ఇంటర్​ చదివాడా?'

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.