ETV Bharat / state

మద్యం అమ్మి డబ్బు సంపాదిస్తే ధనిక రాష్ట్రం అవుతుందా?: ఈటల - bjp mla Etela Rajender fires on kcr and trs government

Etela Rajender fires on kcr : తెరాస ప్రభుత్వంపై భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి విరుచుకుపడ్డారు. తనదైన శైలీలో కేసీఆర్ సర్కారుపై ఘాటు విమర్శలు చేశారు. భూములు అమ్మి ఖర్చు పెడితే ధనిక రాష్ట్రం అవుతుందా? అని ప్రశ్నించారు.

eatala rajender
ఈటల రాజేందర్‌
author img

By

Published : May 7, 2022, 5:05 PM IST

Updated : May 7, 2022, 5:31 PM IST

Etela Rajender fires on kcr : రాష్ట్రాన్ని పాలించడంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పూర్తిగా విఫలమయ్యారని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆరోపించారు. తెరాస ప్రభుత్వానికి నిజాయతీ లేదన్న ఈటల... ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునే అధికారం కేసీఆర్‌కు లేదని వ్యాఖ్యానించారు. రైతు ప్రభుత్వంగా గొప్పలు చెప్పుకుంటున్నారని.. కానీ ఆచరణలో మాత్రం శూన్యమని వెల్లడించారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఆయన పర్యటించారు.

మద్యం అమ్మి డబ్బు సంపాదిస్తే ధనిక రాష్ట్రం అవుతుందా?: ఈటల

Etela Rajender comments : రైతుల కళ్లల్లో మట్టిగొట్టి వారి జీవితాలతో ఆటలాడుతున్నారని ఈటల ధ్వజమెత్తారు. ఇప్పటికీ... కొన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు లేవని మండిపడ్డారు. ఉన్న కేంద్రాల్లో గన్నీ సంచుల కొరత ఉందని తెలిపారు. ధాన్యం తూకాల్లో క్వింటాల్‌ బస్తాకు ఏడున్నర నుంచి పది కిలోల ధాన్యాన్ని కోత విధిస్తున్నారని విమర్శించారు. క్లారిటీ లేని హామీలు ఇచ్చి ప్రజల్ని అయోమయానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ పార్టీలుగా ఏం చేస్తారో అదే చెప్పాలని... ఓట్లు దండుకోవటానికి పూటకోమాట చెప్పకూడదని ఈటల పేర్కొన్నారు.

'' కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ మర్చిపోయారు. ధనిక రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతున్నారు. భూములు అమ్మి ఖర్చు పెడితే ధనిక రాష్ట్రం అవుతుందా?. మద్యం అమ్మి డబ్బు సంపాదిస్తే ధనిక రాష్ట్రం అవుతుందా? బాగానే ఉన్న సచివాలయంను వాస్తు కోసం కూలగొట్టారు. ఇతర సీఎంల పేర్లున్న శిలాఫలకాలు ఉండొద్దని భావించారు. పూర్వం చక్రవర్తులు చేసిన పని ఇవాళ కేసీఆర్‌ చేస్తున్నారు. ఆచరణయోగ్యం కానీ హామీలను రాహుల్‌గాంధీ ఇచ్చారు. రూ.2 లక్షల రుణమాఫీ చేయాలంటే రూ.40 వేల కోట్లు కావాలి. వ్యవసాయానికి కేంద్రం పెద్దపీట వేస్తోంది.'' - ఈటల రాజేందర్‌, ఎమ్మెల్యే

Etela Rajender on trs: తెరాస ఇచ్చిన హామీలు నేటికి నెరవేర్చలేదని ఈటల చెప్పారు. ధనిక రాష్ట్రమని చెప్పుకునే కేసీఆర్.. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతున్నారని విమర్శించారు. భూములు అమ్మి ఖర్చు పెడితే ధనిక రాష్ట్రం అవుతుందా? అని ప్రశ్నించారు. మద్యం అమ్మి డబ్బు సంపాదిస్తే ధనిక రాష్ట్రం అవుతుందా? అని మండిపడ్డారు.

ఇవీ చదవండి:

Last Updated : May 7, 2022, 5:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.