ETV Bharat / state

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం: ప్రేమేందర్ రెడ్డి - హైదరాబాద్ తాజా సమాచారం

రాబోయే జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకెళ్తామని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్​లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో విస్తృత చర్చ నిర్వహించారు. ప్రభుత్వ అవినీతిని ఈ ఎన్నికల్లో ఎండగడతామని ఆయన అన్నారు.

BJp meeting on GHMC elections on hyderabad party office
జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం : ప్రేమేందర్ రెడ్డి
author img

By

Published : Nov 7, 2020, 6:54 PM IST

త్వరలో జరగనున్న జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠం కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పని చేస్తామని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్​లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో కలిసి సమీక్ష నిర్వహించారు.

రెండు పడక గదుల ఇల్లు, ఎల్​ఆర్​ఎస్​, వరద సాయంపై అవినీతికి పాల్పడుతున్న తెరాసకు ఈ ఎన్నికల్లో అంతం ఖాయమన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై సమావేశంలో చర్చించినట్లు ఆయన వెల్లడించారు. సన్నవరికి 500 రూపాయల బోనస్​ ప్రకటించాలని డిమాండ్ చేశారు. దుబ్బాక ఉపఎన్నికలో విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కేంద్రహోంశాఖ సహాయమంత్రి కిషన్​ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఓబీసీ జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:'సీఎం సారూ.. మేం చచ్చిపోతాం... కారుణ్య మరణాలకు అనుమతివ్వండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.