అప్రజాస్వామిక విధానాలను భాజపా సహించదని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు అన్నారు. ఇంటర్ ఫలితాల్లో లోపాలకు నిరసనగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నిరవధిక దీక్ష ప్రారంభిస్తే పోలీసులు నిర్బంధించటం దారుణమని హైదరాబాద్లో ఆక్షేపించారు. పోలీసులు ఎక్కడికి తరలించినా ఆయన దీక్ష కొనసాగుతుందని తెలిపారు. రేపు పార్టీ తరఫున అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట నిరసన తెలుపుతామని ప్రకటించారు.
ఇదీ చదవండి : కోదండరాం, తెజస పార్టీ నేతల అరెస్ట్