డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో తెరాస ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని భాజపా నాయకులు ఆరోపించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలను భాజపా నేతలు పరిశీలించారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని 210 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పనులు నత్తనడక సాగుతున్నాయని... చేస్తున్న పనుల్లోనూ నాణ్యత పాటించడం లేదని భాజపా నేతలు ఆరోపించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయని ప్రజలను మభ్యపెట్టేందుకు తెరాస నాయకులు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: లెక్కల్లో చూపించారు... క్షేత్రస్థాయిలో నిర్మించలేదు: భట్టి