కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో హైదరాబాద్ నాంపల్లి నియోజకవర్గంలోని పలు బస్తీల్లో భాజపా నాయకులు డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్లో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజలకు కేంద్ర పథకాల పైన అవగాహన లేదని... అందుకే వారికి అవగాహన కల్పించడానికి భాజపా నేతలు కృషి చేస్తున్నారని అన్నారు.
ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి, ప్రధాన మంత్రి సురక్ష బీమా, ప్రధాన మంత్రి సుకన్య స్కీమ్ ఇలా వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయని వాటిని ప్రజలు తెలుసుకొని భాగస్వాములు కావాల్సిందిగా ఆయన కోరారు.
ఇదీ చదవండి : ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం వాయిదా