ETV Bharat / state

Girl falls in nala: 'చిన్నారి మృతికి బాధ్యత వహిస్తూ కేటీఆర్​ రాజీనామా చేయాలి' - Child silence died

bjp leaders reaction on Girl falls in nala: సికింద్రాబాద్​లో మ్యాన్​హోల్​లో పడి మృతి చెందిన చిన్నారి మౌనిక ఘటనపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. జీహెచ్‌ఎంసీ, ఆర్అండ్‌బీ మధ్య సమన్వయం లేకపోవడం వలనే తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి మండిపడ్డారు. ఘటనపై బాధ్యత వహిస్తూ మున్సిపల్​శాఖ మంత్రి కేటీఆర్​ వెంటనే రాజీనామా చేయాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్​ డిమాండ్​ చేశారు.

bjp
bjp
author img

By

Published : Apr 29, 2023, 3:42 PM IST

bjp leaders reaction on Girl falls in nala: శుక్లవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు సికింద్రాబాద్​లో ఇవాళ ఉదయం పాల పాకెట్​ కోసమని తమ్ముడుతో కలిసి షాప్​కు వెళ్లిన మౌనిక అనే 11 ఏళ్ల చిన్నారి నాలాలో పడి కొట్టుకుపోయిన విషయం తెలిసిందే.. ఈ ఘటనపై సర్వత్ర విమర్శలు వస్తున్నాయి. ఇందులో జీహెచ్​ఎంసీ లోపం స్పష్టంగా కనిపిస్తోందని వివిధ రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. తాజాగా ఈ ఘటనపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. చిన్నారి మౌనిక తవ్వేసిన రోడ్డు, మ్యాన్​హోల్‌లో పడి కొట్టుకుపోయిందని కిషన్​రెడ్డి అన్నారు.

"రాత్రికి రాత్రి రోడ్లను తవ్వేస్తున్నారు.పైప్ లైన్ వేయాలి కాబట్టి ఆపేస్తున్నామంటున్నారు. చిన్నారి మౌనిక వర్షం నీటిలో కొట్టుకుపోయింది. జీహెచ్‌ఎంసీ కాంట్రాక్టర్లు రూ.5 నుంచి రూ.10 లక్షలు చేసిన పనికి డబ్బులు చెల్లించలేదని ధర్నా చేశారు. జీహెచ్‌ఎంసీ వేలకోట్లు అప్పులు తెచ్చినా కనీస సౌకర్యాలు మెరుగుపడటం లేదు"- కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి

గతంలో అంబర్​పెట్​లో కూడా ఒక మహిళ ఇదే విధంగా మృతి చెందిందని కిషన్​రెడ్డి గుర్తు చేశారు. జీహెచ్‌ఎంసీ, ఆర్అండ్‌బీ మధ్య సమన్వయం లేకపోవడంతో ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు. పేదలు ఉండే సికింద్రాబాద్​లాంటి ప్రాంతాల్లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని కిషన్​రెడ్డి గుర్తు చేశారు. రాష్ట్రంలో 80శాతం ఆదాయం హైదరాబాద్​ నుంచి వస్తోందని.. అయినా జీహెచ్‌ఎంసీ, వాటర్ వర్క్స్ లేమితో ఉన్నాయన్నారు. ఇలాంటి ప్రమాదాలు జరిగే ప్రాంతాలను ముందుగానే గుర్తించి.. ముందస్తు చర్యలు చేపట్టాలని కిషన్​రెడ్డి సూచించారు.

  • This is very unfortunate that 10-year-old Mounika in a bid to help her brother fell in drain & lost her life in Secunderabad.

    It is definitely failure of civic body & GHMC sponsored death. Taking responsibility of series of deaths due to manholes, potholes and stray dogs,… https://t.co/8Km5yCC0jT

    — Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) April 29, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ ఘాటుగా స్పందించారు. జీహెచ్​ఎంసీ వైఫల్యం వల్లే సికింద్రాబాద్‌లో 10 ఏళ్ల చిన్నారి మౌనిక చనిపోయిందని బండి సంజయ్‌ ట్వీట్‌ చేశారు. మ్యాన్‌హోళ్లు, గుంతలు, వీధికుక్కల కారణంగా వరుస మరణాలకు బాధ్యత వహిస్తూ మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్​ రాజీనామా చేయాలని విమర్శించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని ఒపెన్‌ డ్రెయిన్లు, మ్యాన్‌హోల్‌లను సమీక్షించాలని డిమాండ్‌ చేశారు.

డ్రైనేజీ వ్యవస్థ మెరుగు లోపల మురుగు అన్నట్లుగా ఉంది: మరోవైపు ఇదే అంశంపై స్పందించిన బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌.. బీఆర్​ఎస్​ సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ డ్రైనేజీ వ్యవస్థపైన మెరుగు లోపల మురుగు అన్నట్లుగా ఉందని ధ్వజమెత్తారు. వందల కోట్లతో నాలాల క్యాపింగ్‌ చేస్తామన్న హామీ ఉత్త మాటగానే మిగిలిపోయిందని దుయ్యబట్టారు.

"బీఆర్​ఎస్​ అసమర్థత, లోపం వలనే చిన్నారి ఈరోజు మృతి చెందింది. కేటీఆర్​ చెప్పిన మాటలకు చేసిన పనులకు ఏ మాత్రం పొంతన లేదు. చిన్న వర్షం పడిన హైదరాబాద్​లో రోడ్లపై మోకాలి లోతులో నీరు నిలిచిపోతుంది. ఇందులో జీహెచ్​ఎంసీ లోపం కనిపిస్తోంది. ఈ ఘటనపై మంత్రి కేటీఆర్​ బాధ్యత వహించాలి."- లక్ష్మణ్​, ఎంపీ

బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌

ఇవీ చదవండి:

Girl falls in nala : పాల ప్యాకెట్​ కోసం వెళ్తుండగా.. నాలాలో పడి చిన్నారి మృతి

Child Kidnap in Hyderabad: పసికందు కిడ్నాప్ కథ సుఖాంతం

TS Secretariat: ప్రారంభోత్సవ వేళ వర్షం.. కొత్త సచివాలయ ప్రాంగణంలోకి వరదనీరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.