ETV Bharat / state

'అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలి' - హైదరాబాద్​ వార్తలు

యువతికి మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ... బోయిన్​పల్లి పోలీస్ స్టేషన్ ఎదుట భాజపా నేతలు ఆందోళనకు దిగారు.

bjp-leaders-protest-at-bowenpally-on-rape-case
'అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలి'
author img

By

Published : Mar 5, 2021, 3:43 PM IST

సికింద్రాబాద్ బోయిన్​పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో యువతిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని భాజపా నేతలు డిమాండ్ చేశారు. బోయిన్​పల్లికి చెందిన ఇర్ఫాన్.. మాయమాటలు చెప్పి యువతిని నిర్బంధించి.. అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపించారు.

యువతి కనిపించకపోవడంతో... ఆమె తల్లిదండ్రులు బోయిన్​పల్లి పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో యువతి తప్పించుకుని తల్లిదండ్రులకు విషయం చెప్పిందని పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి... న్యాయం చేయాలంటూ స్టేషన్ ముందు భాజపా నాయకులు ఆందోళనకు దిగారు.

ఇదీ చూడండి: ఇంటర్ బోర్డు ముట్టడికి భాజపా యువ మోర్చా యత్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.