రెండేళ్ల నాటి కేసులో రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్నబ్ గోస్వామిని ముంబయి పోలీసులు అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ.... భాజపా, భారతీయ జనతా యువ మోర్చా నాయకులు హైదరాబాద్లో ఆందోళనకు దిగారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బషీర్బాగ్ కూడలిలో వారు నిరసన తెలిపారు.
ఇది పత్రికా స్వేచ్ఛపై దాడి అని.. మహారాష్ట్ర ప్రభుత్వ తీరును చూస్తుంటే ఎమర్జెన్సీ రోజులు గుర్తుకు వస్తున్నాయన్నారు. అరెస్టు ద్వారా మహారాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. గోస్వామి అరెస్టు సందర్భంగా పోలీసులు దురుసుగా వ్యవహరించడాన్ని తప్పుపట్టిన నాయకులు.. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇవీ చూడండి: కేసీఆర్ కుటుంబ పాలనతో రాష్ట్రం దివాలా తీసింది: భట్టి