ETV Bharat / state

BJP Leaders Meeting on Telangana Elections : దిల్లీలో బీజేపీ నేతల సమావేశం.. తెలంగాణ ఎన్నికలపై చర్చ - Telangana bjp leaders meet with JP Nadda in Delhi

BJP Leaders Meeting on Telangana Elections : దిల్లీలో జేపీ నడ్డా నివాసంలో.. బీజేపీ నాయకులు భేటీ అయ్యారు. తెలంగాణ ఎన్నికలకు సంబంధించిన కీలక అంశాలపై చర్చిస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక, ప్రచారవ్యూహాలపై నేతలు చర్చలు జరుపుతున్నారు.

BJP
BJP
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 19, 2023, 9:09 PM IST

BJP Leaders Meeting on Telangana Elections in Delhi : అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలు, అభ్యర్థుల ఎంపికపై బీజేపీ అధిష్ఠానం కీలక కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఈరోజు దిల్లీలోని జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) నివాసంలో పార్టీ అగ్రనేతలు, రాష్ట్రం నాయకత్వం సమావేశమైంది. ఈ భేటీకి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా హాజరయ్యారు. తెలంగాణ ఎన్నికలకు సంబంధించిన కీలక అంశాలపై చర్చలు జరుపుతున్నారు. అభ్యర్థుల ఎంపిక, ప్రచారవ్యూహాలపై వారు చర్చిస్తున్నారు.

ఈ సమావేశానికి పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోశ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, తెలంగాణ వ్యవహారాల బాధ్యులు, సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, ఎన్నికల ఇంఛార్జ్‌ ప్రకాశ్ జావడేకర్​ హాజరయ్యారు. మరోవైపు శుక్రవారం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ (BJP Central Election Committee) భేటీ కానున్న నేపథ్యంలో.. ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించకుంది.

BJP Assembly Election Plan 2023 : బీసీ నినాదంతో జనంలోకి వెళ్లనున్న బీజేపీ..

Telangana BJP MLA Candidates List Delay : మరోవైపు బీజేపీ అభ్యర్థిత్వాలపై సుదీర్ఘ కసరత్తు కొనసాగుతోంది. మూడో వంతు స్థానాలకు అభ్యర్థులను ప్రాథమికంగా గుర్తించిన హైకమాండ్.. కొందరి విషయంలో పునరాలోచిస్తోంది. రాష్ట్రంలో ముఖ్య నేతలందర్నీ బరిలో దింపాలని గతంలో భావించినప్పటికీ, ఇప్పుడు ఈ అంశంలో ఆచితూచి వ్యవహరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జాబితా విడుదలకు మరికొన్ని రోజుల సమయం పట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి.

Telangana Assembly Elections 2023 : మొదటి జాబితా కోసం తెలంగాణ బీజేపీ (Telangana BJP) పార్టీ 38 మంది అభ్యర్థులతో.. జాతీయ నాయకత్వానికి ప్రతిపాదనలు పంపింది. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమై జాబితాపై చర్చించి నిర్ణయం వెలువరించే పక్షంలో.. ఈ నెల 10 తర్వాత జాబితా విడుదల చేయాలని భావించింది. అయితే ఆ కమిటీ సమావేశ తేదీలపై స్పష్టత రాలేదు. ఈ క్రమంలోనే ఈ నెల 14 తర్వాత జాబితా ఉంటుందని రాష్ట్ర పార్టీ నేతలు స్పష్టం చేసినా అదీ జరగలేదు. నామినేషన్లకు ఇంకా 20 రోజులే గడువు ఉన్న నేపథ్యంలో ఎక్కువ మందితో జాబితాను విడుదల చేయాలని తాజాగా పార్టీ నిర్ణయించినట్టు తెలుస్తోంది.

Telangana BJP MLA Candidates First List Delay : బీజేపీ తొలి విడత అభ్యర్థుల ప్రకటన మరింత ఆలస్యం.. అప్పటిదాకా ఆగాల్సిందే..!

ఇందులో భాగంగా 38 మంది జాబితాను పునఃపరిశీలించడంతో పాటు ఇతర నియోజకవర్గాల అభ్యర్థిత్వాలను కూడా పరిశీలిస్తున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. టికెట్ల కోసం భారీగా దరఖాస్తులు వచ్చినా అందులో అభ్యర్థిత్వాలు బలంగా కోరుకుంటున్న వారు ఒక్కో స్థానానికి ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. వారివారి బలాలు, సామాజిక సమీకరణాల ప్రాతిపదికగా అభ్యర్థులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. ఈసారి టికెట్ల కేటాయింపులో బీసీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ ప్రాతిపదికన బలమైన సామాజిక వర్గాలకు ఆయా నియోజకవర్గాల్లో ప్రాధాన్యం ఇచ్చే దిశగా అభ్యర్థిత్వాలపై మరోసారి కసరత్తు జరుగుతోందని పార్టీ వర్గాలు తెలిపాయి.

BJP Telangana Election Committees 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా.. బీజేపీ 14 కమిటీలు

BJP Candidate List 2023 Assembly Election : బీజేపీ నయా ప్లాన్​.. అసెంబ్లీ ఎన్నికల బరిలో 18 మంది ఎంపీలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.