నియంత్రిత సాగు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రైతులను నిర్భంధానికి గురి చేస్తోందని భాజపా నేతలు మండిపడ్డారు. ఈ సాగు విధానాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తోందని తెలిపారు. భూసార పరీక్షలు నిర్వహించకుండా సమగ్ర పంటల సాగు చేయాలని, రైతులపై ఒత్తిడి తేవడం సరైన విధానం కాదని వెల్లడించారు. రైతు బంధు, లక్ష రూపాయల రుణమాఫీ ఒకే సారి చేయాలని డిమాండ్ చేస్తూ బషీర్‌బాగ్‌లోని వ్యవసాయ కమిషనర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.
రాష్ట్రంలో భూసార పరీక్షలు నిర్వహించిన తర్వాతే సమగ్ర వ్యవసాయ విధానాన్ని ప్రవేశపెట్టాలని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నకిలీ విత్తనాలు ఇష్టారాజ్యంగా అమ్మకాలు జరుగుతున్నాయని వాటిని వెంటనే అరికట్టాలని కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూదన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.