సికింద్రాబాద్ మెట్టుగూడలో భాజపా నేత సారంగపాణి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు, పేదలకు నిత్యావసరాలు అందజేశారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రధాన మంత్రి మోదీ అమలు చేస్తోన్న నిర్ణయాల పట్ల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయని ఎమ్మెల్సీ రాంచందర్ రావు తెలిపారు.
లాక్డౌన్ సమయంలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోతలు విధించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. రాజకీయాలను పక్కనపెట్టి కరోనాపై అందరూ ఐక్యంగా పోరాడాలని కోరారు.
- ఇవీ చూడండి: పుల్వామాలో భారీ ఉగ్రదాడికి కుట్ర..!