గణపతి ఉత్సవాల సందర్భంగా... నవరాత్రులపై విధించిన ఆంక్షలను వెంటనే తొలగించాలంటూ భాజపా నేతలు ఆందోళనకు దిగారు. అమీర్‌పేటలోని మైత్రీవనం వద్ద రాస్తారోకో నిర్వహించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ భాజపా నేత రావుల శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు.
పోలీసులు అక్కడకు చేరుకుని ఆందోళనకారులను అరెస్టు చేసి... స్టేషన్‌కు తరలించారు. మండపాల వద్ద భక్తులు, కార్యకర్తలపై దాడులు జరిగితే సహించేది లేదని శ్రీధర్ రెడ్డి హెచ్చరించారు.
ఇదీ చూడండి: భద్రాచలం గోదావరి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ