BJP leaders complaint to governor సీఎం కేసీఆర్ నిజాం తరహా నిరంకుశ పాలన సాగిస్తున్నారని భాజపా ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై భాజపా నేతలు గవర్నర్ తమిళిసైకి ఫిర్యాదు చేశారు. ప్రజలకు భరోసా కల్పించేందుకే బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారని లక్ష్మణ్ తెలిపారు.
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగుతుందని భాజపా ఎంపీ లక్ష్మణ్ స్పష్టం చేశారు. కొంతమంది ఎమ్మెల్యేలు అవినీతిని కప్పి పుచ్చుకునేందుకు పాదయాత్రపై దాడులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై భాజపా నేతలు గవర్నర్ తమిళిసైకి ఫిర్యాదు చేశారు.
సీఎం కేసీఆర్... నిజాం తరహా నిరంకుశ పాలన సాగిస్తున్నారు. ప్రజలకు భరోసా కల్పించేందుకే బండి సంజయ్ పాదయాత్ర. లిక్కర్ కుంభకోణంలో ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు పక్కదారి పట్టించేందుకే పాదయాత్ర అడ్డగింత. మునుగోడు ఉపఎన్నికలో ఓటమి భయం పట్టుకుంది. బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతుంది.- లక్ష్మణ్, భాజపా రాజ్యసభ ఎంపీ
గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ను కలిసిన భాజపా నేతలు ప్రజా సంగ్రామ యాత్రకు పోలీసుల అనుమతి.. ఈ నెల 22న భాజపా కార్యకర్తలపై దాడి ఘటనపై విచారణ చేపట్టాలని కోరారు. బండి సంజయ్ పాదయాత్రపై దాడిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పాత్రపై విచారణ జరపాలని గవర్నర్‌కు వినతిపత్రం అందజేశారు. లక్ష్మణ్‌తోపాటు డీకే అరుణ, రఘునందన్‌రావు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్, విజయశాంతి, రాంచందర్రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి గవర్నర్‌ను కలిశారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న లిక్కర్ కేసును పక్కదారి పట్టించేందుకు పాదయాత్రను అడ్డుకున్నారని లక్ష్మణ్ తెలిపారు. ఉద్రిక్త వాతావరణానికి తెరలేపిన కేసీఆర్ రాజకీయంగా మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. లిక్కర్ కుంభకోణంలో ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు వచ్చాయని లక్ష్మణ్ అన్నారు. లిక్కర్ స్కామ్‌ను పక్కదారి పట్టించేందుకే పాదయాత్రను అడ్డుకున్నారని మండిపడ్డారు. మునుగోడు ఉపఎన్నికలో కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందన్నారు.
కవిత నుంచే కేసీఆర్ పతనం: కవిత మీద ఆరోపణలు వస్తే కేసీఆర్ ఎందుకు మాట్లాడడం లేదని మాజీ ఎంపీ విజయశాంతి ప్రశ్నించారు. కవిత నుంచే కేసీఆర్ పతనం ప్రారంభం కాబోతుందని ఆమె అన్నారు. కవిత మీద ఆరోపణలు వస్తే కేసీఆర్ మాట్లాడటం లేదని విజయశాంతి నిలదీశారు. తెరాస కుటుంబం అవినీతి త్వరలోనే బయటకు వస్తుందన్నారు. సంజయ్ పాదయాత్రను అడ్డుకుని కేసులు పెట్టిన భయపడేదని లేదని స్పష్టం చేశారు.
కవిత మీద ఆరోపణలు వస్తే కేసీఆర్ మాట్లాడటం లేదు. తెరాస కుటుంబం అవినీతి బయటకు వస్తుంది. సంజయ్ పాదయాత్రను అడ్డుకుని కేసులు పెట్టిన భయపడం. కవిత నుంచి కేసీఆర్ పతనం ప్రారంభం.- విజయశాంతి, భాజపా నాయకురాలు
ఇవీ చదవండి: బండి సంజయ్ పాదయాత్రను నిలిపేయాలని నోటీసులు జారీ
పాక్ భూభాగంలోకి బ్రహ్మోస్ క్షిపణి, ముగ్గురు అధికారులపై వేటు