ETV Bharat / state

ప్రజా ఆరోగ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం గాలికొదిలేసింది: విజయశాంతి

author img

By

Published : Apr 28, 2021, 7:55 AM IST

కరోనా వేళ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆరోగ్యాన్ని గాలికొదిలేసిందని భాజపా నాయకురాలు విజయశాంతి ఆరోపించారు. ఆరోగ్య శాఖ అధికారులతో ముఖ్యమంత్రి ఇప్పటివరకు ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించలేదని విమర్శించారు. కొవిడ్​ను ఎదుర్కోవడానికి కేంద్రం చేయూతనిస్తోందని తెలిపారు.

bjp leader vijayashanthi fires on cm kcr, cm kcr vijayashanthi
సీఎం కేసీఆర్​పై విజయశాంతి ఆగ్రహం, భాజపా నేత విజయశాంతి

రాష్ట్రంలో ఆక్సిజన్, ఆస్పత్రుల్లో పడకల కొరత లేదని మంత్రి ఈటల రాజేందర్ చెప్పడం వల్ల ప్రజలు అసహ్యించుకుంటున్నారని భాజపా నేత విజయశాంతి ఆరోపించారు. కొవిడ్​ను ఎదుర్కోవడంలో తెరాస సర్కారు వైఫల్యాలను ఎండగట్టారు. కేంద్రం అందిస్తోన్న చేయూతను పత్రికా ప్రకటనలో కొనియాడారు. పీఎం కేర్ నుంచి 5 ఆక్సిజన్ ప్లాంట్లను కేంద్రం ఏర్పాటు చేసిందని తెలిపారు. ఇంకా 12 ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవడానికి నిధులు ఇచ్చి, యుద్ధ విమానాలను రాష్ట్రానికి పంపించిందని పేర్కొన్నారు.

కేంద్రం వల్లే రెమ్​డెసివిర్

కేంద్ర ప్రభుత్వం స్పందించడం వల్లే రాష్ట్రంలో కరోనా బాధితులకు రెమ్​డెసివిర్ అందుతోందని విజయశాంతి గుర్తు చేశారు. ప్రజా సంక్షేమాన్ని, ఆరోగ్యాన్ని తెరాస గాలికొదిలేస్తోందని విమర్శించారు. ఇప్పటివరకు ఆరోగ్యశాఖ అధికారులతో సీఎం సమీక్షించిన దాఖలాలు లేవని విజయశాంతి అన్నారు. ఏడాది నుంచి ఒక్క ఆస్పత్రి నిర్మించలేదని ఆరోపించారు. వ్యాక్సినేషన్ విషయంలో కేంద్రంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చర్యలేవి?

కరోనా అనుమానితులు పరీక్షలు చేయించుకోవడానికి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో రాష్ట్ర ప్రభుత్వం గ్రహించకపోవడం తగునా? అని నిలదీశారు. ప్రైవేటు ఆస్పత్రులు ప్రజలను దోపిడీ చేస్తున్నా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి... కరోనా నియంత్రణ కోసం యంత్రాంగాన్ని సమాయత్తం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: ప్రభుత్వ ఆదేశాలు బేఖాతర్​.. కార్పొరేట్​ కళాశాలల ఫీ జులుం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.