Ramchander Rao on Buying TRS MLAs Issue: సిట్ కేసులో బీజేపీ నాయకులకు లుకౌట్ నోటీసులిచ్చారని... అసత్య ప్రచారాలు చేస్తున్నారని భాజపా మాజీ ఎమ్మెల్సీ రాంచంద్రరావు ఆరోపించారు. లుకౌట్ నోటీసులకు ఎం.హెచ్.ఎ కొన్ని గైడలెన్స్లు ఉన్నాయని తెలిపారు. లుకౌట్ నోటిసులపై తెరాస తప్పుడు సమాచారం ఇస్తుందని ఆయన మండిపడ్డారు.
టీఆర్ఎస్ నాయకుడు రావుల శ్రీధర్, తెరాస సామాజిక మాధ్యమాల ప్రతినిధి సతీష్ రెడ్డి అనే వ్యక్తులకు ఏం అధికారం ఉందని లుకౌట్ నోటీసుల గురించి అసత్య ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ ఫేక్ న్యూస్‌పై ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ స్పందించాలని కోరారు. ఈ ఇద్దరిపై చర్యలు తీసుకొని... నిక్షిప్తంగా దర్యాప్తు చేయాలని రాంచందర్‌రావు డిమాండ్ చేశారు. ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తారనే నెపంతోనే సిట్ కాదు.. సీబీఐతో విచారణ జరిపించాలన్నారు. తెరాస ఎన్ని చౌకబారు రాజకీయాలు చేసిన తమ పార్టీ దీటుగా ఎదుర్కొంటుందని రాంచందర్ రావు స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: