Muralidhar Rao on Upcoming Elections in Telangana : తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడి మార్పు కారణంగా పార్టీకి నష్టం వచ్చిందంటూ అనడం సరైంది కాదనీ మధ్యప్రదేశ్ బీజేపీ ఇంఛార్జ్ మురళీధర్‌రావు పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా జాతీయ నాయకత్వం.. అధ్యక్షుడి మార్పునకు మొగ్గుచూపిందని.. ఎందుకు మార్చారు అనేది పార్టీ పెద్దలకు బాగా తెలుసన్నారు.
బండి సంజయ్‌కి పార్టీలో నేతలందరినీ కలుపుకుపోవడం.. ఇబ్బందికరమని భావించి అధినాయకత్వం తప్పించింది కావొచ్చన్నారు. ఎన్నికలకు తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో కొందరు పెద్ద నాయకులు వస్తారని... వారిని కలుపుకుపోవడంపై ఇబ్బందులు వస్తాయని భావించి తప్పించారని అభిప్రాయం వ్యక్తం చేశారు. సీనియర్, జూనియర్ అని బేధభావాలు రావొచ్చనే ఉద్దేశంతో అలా చేసి ఉండొచ్చన్నారు. హైదరాబాద్ వచ్చిన మురళీధర రావు.. మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ చేశారు.
Muralidhar Rao on Present Politics in Telangana : కేసీఆర్‌ను(KCR) వెల్ఫేర్ విషయంలో కొట్టలేమని.. అలా అని ప్రతిసారి వెల్ఫేర్ పేరుతో కూడా వారు గెలవలేరన్నారు. కేసీఆర్‌ను కొట్టాలంటే.. ప్రజాసమస్యలను క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలని.. లేదంటే ఓడించలేమని పేర్కొన్నారు. తెలంగాణ జనాభాలో యూత్ 65 శాతం మంది ఉన్నారన్నారు. రాష్ట్రంలో ఇవాళ నిరుద్యోగ సమస్య తీవ్రంగా వెంటాడుతోంది. యువతకు అండగా ఉంటే సులభంగా కేసీఆర్‌ను ఓడించొచ్చన్నారు. ప్రజాధనంను కొల్లగొట్టి అవినీతి చేసినోళ్లు అంతా జైలుకు పోవాల్సిందేనని.. అందుకే జైళ్లు కడుతున్నామని పరోక్షంగా కవితను ఉద్దేశించి అన్నారు.
Upcoming Elections in Madhyapradesh : మధ్యప్రదేశ్‌లో జరగబోయే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్యే ప్రధాన పోటీ నెలకొందని.. ఇవి తప్ప మరో పార్టీ రేసులో లేదనీ మురళీధర్‌రావు అన్నారు. కాంగ్రెస్ అసంతృప్తి నేతలు బీజేపీలో(BJP).. కమలం అసంతృప్తి నేతలు కాంగ్రెస్ లో చేరుతారు అంతేకానీ మధ్యప్రదేశ్‌లో మరో ప్రత్యామ్నాయం లేదన్నారు. పాలిటిక్స్ ఒక బ్యూటీ అని.. ఒకరి గురించి మరొకరు చెబుతుంటారని.. అలా సులభంగా అవతలి వారిని స్టడీ చేయొచ్చనీ మీడియాతో నిర్వహించిన ఇష్టాగోష్టిలో తెలిపారు.
ఎన్నికల్లో ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌కు వ్యత్యాసం ఎక్కువగా ఉందని.. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో గట్టి పోటీ ఉండదన్నారు. కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి గట్టి పోటీ ఇచ్చిన కాంగ్రెస్.. మధ్యప్రదేశ్‌లో ఇవ్వలేకపోవచ్చు అన్నారు. సంక్షేమ పథకాలు అమలులో కేసీఆర్ ముందున్నారని.. అక్కడ శివరాజ్‌సింగ్ అలాగేనన్నారు. కర్ణాటకలోలాగా మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ హామీలు ప్రజలు నమ్మేస్థితిలో లేరన్నారు. శివరాజ్‌సింగ్ వాళ్లకంటే ఒకడుగు ముందే ఉన్నారనీ చెప్పారు. సిద్ధరామయ్య మాస్ లీడర్.. కమల్‌నాథ్ మంచి లీడర్ కానీ మాస్ ఇమేజ్ లేదన్నారు.
ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ ఎన్నికలకు బీజేపీ ఫస్ట్ లిస్ట్.. సీఎం బఘేల్‌పై దుర్గ్ ఎంపీ పోటీ
Telangana BJP 2023 Elections Plan : 'పార్టీ బలహీనంగా ఉన్న చోట త్వరితగతిన బలోపేతం చేయాలి'