రామజన్మభూమిలో మందిర నిర్మాణం సంతోషకరమని... భాజపా సీనియర్ నాయకుడు కొత్తకాపు రవీందర్‌రెడ్డి అన్నారు. దేశప్రధాని నరేంద్రమోదీ ప్రత్యేక చొరవతోనే హైందవ జాతి కల సాకారమవుతుందని చెప్పారు. రామజన్మభూమిలో భూమిపూజ నిర్వహిస్తున్న బుధవారము రోజు అందరం వేడుకలు జరుపుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఇంటిముందు దీపాలు వెలిగించాలని తెలిపారు. సైదాబాద్‌లో సాయంత్రం బాణాసంచా కాల్చి వేడుక చేస్తామని పేర్కొన్నారు. కరోనా కట్టడి వలన భూమిపూజకు వెళ్ళటం లేదని పరిస్థితులు చక్కబడిన తరువాత సైదాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో తరలివెళ్లి శ్రీరాముడి ని దర్శించుకుంటామని వివరించారు.
ఇవీ చూడండి: గ్రేటర్‌లో కాస్త ఊరట... తాజాగా 273 మందికి వైరస్