ముఖ్యమంత్రి కేసీఆర్‌పై భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శలు గుప్పించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాపై ముఖ్యమంత్రి మరోసారి దొంగ ప్రేమ కనబరుస్తున్నారని ధ్వజమెత్తారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుతో ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలకు ఈ ఏడాది వంద శాతం నీరు అందిస్తామంటున్న కేసీఆర్.. ఇప్పటి వరకూ పాలమూరు-రంగారెడ్డి భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించలేదని విమర్శించారు. ఇంకెన్నాళ్లు ఇలాంటి మాటలు చెబుతారని నిలదీశారు.
ఉమ్మడి పాలమూరు రైతులను కేసీఆర్ మోసం చేస్తున్నారని అరుణ ఆరోపించారు. నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా ప్రాజెక్టుల్లో పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో విత్తన రాయితీ పూర్తిగా కనుమరుగైంది: జీవన్‌రెడ్డి