రాష్ట్రంలో మద్యం నిషేధించాలని ఈనెల 12, 13న మాజీ మంత్రి, భాజపా నాయకురాలు డీకే అరుణ నిరాహార దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు. మద్యం వల్లే మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు.
వరంగల్ బాధితురాలి హత్యపై ఆమె కుటుంబ సభ్యులకు అనుమానాలున్నాయని అరుణ తెలిపారు. ఇద్దరు నిందితులను పోలీసులు కాపాడుతున్నారని అనుమానం వ్యక్తం చేశారు.
ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితులను విచారించి, కఠినంగా శిక్షించాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు. దిశకు న్యాయం చేసినట్లే వరంగల్, ఆసిఫాబాద్ మృతులకు న్యాయం చేయాలని కోరారు. ఆ కుటుంబాలు రాష్ట్రంలో మద్యం నిషేధించాలని కోరుతున్నట్లు తెలిపారు.
- ఇదీ చూడండి : ఓ దాత... మీ సహృదయతే మా విధిరాత!