సకల జనుల సమ్మె సమయంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేసిన కేసీఆర్.. ఇప్పుడు ఎందుకు మాట మార్చారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించినా స్పందించలేదని తెలిపారు. అరెస్టుల పేరుతో ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఆర్టీసీ ఉద్యమాన్ని భాజపా ముందుకు నడిపిస్తుందని చెప్పారు. ఇవాళ లక్ష్మణ్ సమక్షంలో డా.వీరపనేని పద్మ, వరంగల్, హైదరాబాద్‌కు చెందిన పలువురు వైద్యులు, ప్రొఫెసర్‌లు భాజపాలో చేరారు.
ఆర్టీసీ సమ్మెను అరెస్టులతో అణచివేయలేరు: లక్ష్మణ్ - bjp laxman fires on cm kcr
అరెస్టుల పేరుతో ఆర్టీసీ ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. తాము ఉద్యమాన్ని నడిపిస్తామని తెలిపారు.