తెలంగాణలో నయా నిజాం పాలన కొనసాగుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో హక్కుల కోసం ఆత్మ బలిదానాలు చేసుకునే దుస్థితి వచ్చిందని ఆయన దిల్లీలో ఆవేదన వ్యక్తం చేశారు. మొన్న రాజాసింగ్, నిన్న బండి సంజయ్ పట్ల పోలీసుల తీరు ఆక్షేపనీయమన్నారు. మంచిర్యాల జిల్లాలో ఒకే కుటుంబంలోని నలుగురు డెంగీతో చనిపోవడం బాధాకరమన్నారు. డెంగీ మరణాలపై ప్రభుత్వం అసత్యాలు చెప్తోందని ఆరోపించారు. ప్రభుత్వ వైఖరి వల్లే కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: పవర్ స్టార్ అభిమానులు పండుగ చేసుకునే వార్త..