భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అటల్ ఫౌండేషన్ తరపున ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. లాక్‌డౌన్ సమయంలో ఆయన చేసిన సేవలకుగాను కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ నుంచి గుర్తింపు లభించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్‌వి.సుభాష్ వెల్లడించారు.
వివిధ ప్రాంతాల్లో డాక్టర్లకు పీపీఈ కిట్లు, పేదలకు నిత్యావసరాల పంపిణీ, తదితర కార్యక్రమాలను లక్ష్మణ్ చేపట్టారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు లక్ష్మణ్‌కు ప్రశంసా పత్రం రావడం గర్వంగా భావిస్తున్నారని సుభాష్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి : కరిగిపోయిన కొలువులు.. ఊగిసలాడుతున్న ఉద్యోగాలు!