విజయవాడ భాజపా కార్యాలయంలో.. రేపు ఉదయం 9.30 గంటలకు ఆ పార్టీ నేతలు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ జీవీఎల్, భాజపా రాష్ట్ర బాధ్యుడు సునీల్ దేవధర్ పాల్గోనున్నారు. జనసేనతో భేటీలో చర్చించాల్సిన అంశాలపై ప్రాథమిక సమావేశం జరగనుంది. అనంతరం.. భాజపా, జనసేన కీలక సమావేశం జరగనుంది.
ఉదయం 11 గంటలకు విజయవాడ ఎంజీరోడ్‌లోని ఓ హోటల్‌లో ఇరు పార్టీల నేతలు భేటీ కానున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ నాదెండ్ల మనోహర్ భాజపా నేతలతో చర్చిస్తారు. తాజా రాజకీయ పరిణామాలు, అమరావతి రైతుల ఆందోళనలు, ప్రజా సమస్యలపై పోరాటం, 2 పార్టీలూ కలిసి పనిచేయడంపై ప్రధానంగా చర్చించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఇరుపార్టీల నేతలు మీడియా సమావేశం నిర్వహించి, వివరాలు తెలియజేస్తారు.
ఇదీ చదవండి: