ETV Bharat / state

BJP Janasena Alliance Issue 2023 : జనసేనతో బీజేపీ పొత్తు.. కాషాయ నేతలకు తలనొప్పి తెస్తోందిగా..? - జనసేనకు బీజేపీ ఎన్ని సీట్లు కేటాయించింది

BJP Janasena Alliance Issue in Telangana 2023 : రాష్ట్రంలో బీజేపీతో జనసేన పొత్తు ఖాయమైన తర్వాత కాషాయ పార్టీ ఆశావహుల గుండెల్లో గుబులు మొదలయింది. టికెట్ వస్తుందనుకున్న అభ్యర్ధులు ఇప్పుడు తమ స్థానంలో టికెట్ జనసేనకు కేటాయిస్తారేమోనని కాస్త అయోమయంలో పడ్డారు. ఒకవేళ అదే జరిగితే.. తమ అసంతృప్తిని వెల్లగక్కేలా ఆందోళనకు దిగేలా ప్రణాళికలు రచిస్తున్నారు.

Kukatpally BJP Ticket Issue
BJP and Janasena Alliance in Telangana
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 31, 2023, 11:35 AM IST

BJP Janasena Alliance Issue in Telangana 2023 : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. అయితే శాసనసభ ఎన్నికల బరిలో నిలవాలని ఆశపడిన బీజేపీ ఆశావహులకు కొత్త చిక్కొచ్చిపడింది. దీనికి కారణం జనసేనతో కలిసి పోటీ చేయాలని అధిష్ఠానం నిర్ణయించడమే. దీనివల్ల నగర పరిధిలో కొన్ని సీట్లు జనసేనకు ఇవ్వాల్సి రావడంతో.. బీజేపీ నేతల ఆశలు అడియాశలు అవుతున్నాయి. వారికి సీటు దక్కదేమోనని ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే కూకట్​పల్లి బీజేపీ ఎమ్మెల్యే సీటు జనసేనకు ఇవ్వొదంటూ సోమవారం రోజున ఆ నియోజకవర్గ నాయకులు రాష్ట్ర కార్యాలయం ముందు ఆందోళన చేశారు.

Kukatpally BJP Ticket Issue : ప్రస్తుతం జరిగే ఎన్నికల్లో 119 స్థానాల్లో పోటీ చేసేందుకు బీజేపీ సిద్దమైంది. ఈలోపు రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల దృష్ట్యా జనసేనతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని చర్చించేందుకు ఇరు పార్టీ నేతలు బీజేపీ అగ్రనేత కేంద్ర మంత్రి అమిత్​ షాను కలిశారు. రెండు పార్టీలు కలిసి ఈ ఎన్నికల్లో వెళ్లాలని.. సీట్ల విషయంలో అవగాహనకు రావాలని ఇరు పార్టీల నేతలకు అమిత్ షా సూచించారు.

Kishan Reddy Meet Pawan Kalyan : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్‌ మద్దతు కోరిన కిషన్‌రెడ్డి

ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 22 స్థానాల్లో పోటీ చేయాలని జనసేన భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో అధిక భాగం రాజధాని పరిధిలోనే పోటీ చేయాలని ఆ పార్టీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. పొత్తులో భాగంగా కనీసం 20 స్థానాల్లో అవకాశం కల్పించాలని జనసేన నేతలు కోరారు. దీనిపై బీజేపీ అగ్రనేతలు ఇంకా స్పందించలేదు. పది సీట్లు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

BJP Leaders Worry Over Alliance With Janasena : జనసేనకు హైదరాబాద్​తో పాటు ఖమ్మం తదితర జిల్లాలో ఇవ్వాలని బీజేపీ నాయకత్వం ఆలోచిస్తోంది. దీని ప్రకారం భాగ్యనగరంలో నాలుగైదు సీట్లు జనసేనకు లభించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మల్కాజిగిరి, ఉప్పల్‌, సికింద్రాబాద్‌, కూకట్‌పల్లి తదితర స్థానాల్లో బరిలోకి దిగాలని జనసేన భావిస్తోంది. ఈ స్థానాల కేటాయింపులపై జనసేనతో బీజేపీ ఇంతవరకు పూర్తిస్థాయిలో చర్చలు జరపలేదు. ఫోన్‌ ద్వారా పవన్‌కల్యాణ్‌తో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడారని పార్టీ వర్గాలు తెలిపాయి. బుధవారం మూడో జాబితాను విడుదల చేయనున్నట్లు బీజేపీ నాయకులు చెబుతున్నారు.

BJP Janasena Alliance in Telangana : బీజేపీ-జనసేన పొత్తు కుదిరింది..! ఇక సీట్ల లెక్క తేలాలి

BJP MLA Candidate Final List 2023 : మరోవైపు టికెట్​ రాకపోతే.. ఆందోళనలు చేసేందుకు ఆశావహులు సన్నద్దం అవుతున్నారు. కూకట్​పల్లి స్థానాన్ని పొత్తులో భాగంగా జనసేనకు ఇవ్వొచ్చనే ఊహాగానాలతో.. ఆ టికెట్​ ఆశిస్తున్న స్థానిక నేతలు కాంతారావు, మేడ్చల్‌ అర్బన్‌ పార్టీ అధ్యక్షుడు హరీశ్‌ రెడ్డి, మరో నేత వడ్డేపల్లి రాజశ్వేరరావు సోమవారం రోజున పార్టీ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. ఈ విధంగానే బీజేపీ సీటు వస్తుందని ఆశపడుతున్న మిగతా ఆశావహులు కూడా ఆందోళన బాట పట్టనున్నారని తెలుస్తోంది.

BJP and Janasena Alliance in Telangana : కేంద్రమంత్రి అమిత్​ షాతో పవన్​ కల్యాణ్​ భేటీ.. పొత్తుపై క్లారిటీ వచ్చినట్లేనా?

Telangana BJP MLA Candidates Second List : కొలిక్కివస్తోన్న అభ్యర్థుల ఎంపిక.. నవంబర్​ 1 లేదా 2న రెండో జాబితా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.