ETV Bharat / state

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కమలదళం మాస్టర్ ప్లాన్స్​ - నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా వీధిసభలు

BJP will hold street meetings from today: రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా కమలదళం వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంతోపాటు కేసీఆర్ సర్కారు వైఫల్యాలను క్షేత్రస్థాయిలో ఎండగట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వీధిసభలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి ఈనెల 25 వరకు జరిగే వీధిసభలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రారంభించనున్నారు. 16 రోజుల్లో 11 వేల సభలు నిర్వహించేలా పార్టీ ప్రణాళికలు రచించింది.

BJP is Ready to Organize Street Meetings

author img

By

Published : Feb 10, 2023, 9:34 AM IST

BJP is Ready to Organize Street Meetings: గులాబీ తోటలో కమలవికాసమే లక్ష్యంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రణాళికలు రచిస్తోంది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలంటే, క్షేత్రస్థాయిలో కేడర్‌ను పెంచుకోవాలని నిర్ణయించింది. ఇందుకోసం పార్టీలో చేరికలు, సంస్థాగత బలోపేతంపై రాష్ట్ర నాయకత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. పశ్చిమబెంగాల్ తరహా వ్యూహాన్ని తెలంగాణలోనూ అమలు చేసేందుకు పార్టీ అధిష్టానం పావులు కదుపుతోంది.

BJP street meetings across the state from today: నేటి నుంచి 25 వరకు రాష్ట్రవ్యాప్తంగా వీధిసభలు నిర్వహించాలని ఆదేశించింది. తొలుత 9 వేల సభలు నిర్వహించాలని భావించినా మరో 2 వేల సభలు అదనంగా నిర్వహించాలని. రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. తెలంగాణ వ్యాప్తంగా 16 రోజుల్లో ప్రతిరోజు సగటున 733 వీధి సభలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

BJP street meetings from today: వీధి సభలను కూకట్‌పల్లి నియోజకవర్గంలోని ఓల్డ్‌ బోయిన్‌పల్లి చౌరస్తాలో రాష్ట్ర కమలదళపతి బండిసంజయ్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం నియోజకవర్గాల వారీగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నారు. సికింద్రాబాద్ సెగ్మెంట్‌లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సనత్‌నగర్‌లో జరిగే వీధి సభకు రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌తో పాల్గొననున్నారు.

మహబూబ్‌నగర్‌లో డీకే అరుణ, ఉప్పల్‌లో రఘునందన్​రావు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఈటల రాజేందర్, జగిత్యాలలో ఎంపీ అర్వింద్, దుబ్బాకలో విజయశాంతి, పరిగిలో జితేందర్‌రెడ్డి, భువనగిరిలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఆలేరులో బూర నర్సయ్య గౌడ్ వీధి సభల్లో పాల్గొననున్నారు. జనసమీకరణ చేపట్టకుండా ఉన్న కొద్దిమందితోనైనా, సభ జరపాలని పార్టీ నిర్ణయించింది.

తద్వారా పార్టీకి ఎంతమేరకు ఆదరణ ఉందనేది తెలుసుకోవచ్చనేది రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. వీధి సభల తర్వాత బలహీనంగా ఉంటే ఆ ప్రాంతంలో బలోపేతమయ్యేందుకు ఎలాంటి వ్యూహాలు రచించాలనే అంశంపై నేతలు దృష్టిసారించనున్నారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని మార్కెట్ యార్డులు, గ్రామచౌరస్తా వంటి ప్రదేశాల్లో సభలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది.

వీధి సభల్లో మాట్లాడే అంశాలపై ఇప్పటికే 800 మందికి రాష్ట్ర నాయకత్వం ప్రత్యేక శిక్షణనిచ్చింది.కేంద్ర ప్రభుత్వ పథకాలు వివరించడంతోపాటు తెలంగాణకి మోదీ సర్కారు కేటాయించిన నిధుల వంటి అంశాలపై స్పష్టత ఇవ్వనున్నారు. తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వ మోసాలు, వైఫల్యాలను ఎండగట్టనున్నారు. ఇంటింటికీ తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేయనున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.