సమాజంలో అన్ని వర్గాలను గౌరవించాల్సిన అవసరం ఉందని భాజపా ఎమ్మెల్సీ రామచందర్‌రావు అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రజల మనోభావాలను గౌరవించాలని తెలిపారు. మంథనిలో న్యాయవాద దంపతుల హత్యపై ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ ఆర్కేపురం డివిజన్‌లోని ఇంటర్నేషనల్ వాసవీ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ఉప్పల రాజ్యలక్ష్మీ నివాసంలో రామచందర్‌రావును సన్మానించారు.
ఆర్యవైశ్యులను కించపరిచే విధంగా మాట్లాడిన కంచె ఐలయ్యపై ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని విమర్శించారు. భాజపా బలపరిచిన రామచందర్‌రావుకు ఇంటర్నేషనల్ వాసవీ మహిళా సమాఖ్య సంపూర్ణ మద్దతు ఇస్తుందని రాజ్యలక్ష్మీ ప్రకటించారు. మూడు జిల్లాల్లోని ఆర్యవైశ్యులు, సమాఖ్య సభ్యులంతా భాజపా గెలుపుకోసం కృషి చేస్తారని ఆమె తెలిపారు.