BJP Focus On Lok Sabha Elections Telangana 2024 : లోక్‌సభ ఎన్నికల కార్యాచరణలో భాగంగా కీలకాంశాలపై బీజేపీ(BJP) దృష్టిసారించింది. అసెంబ్లీ ఎన్నికల్లో గుర్తించిన లోటుపాట్లు అధిగమించి పదికి పైగా ఎంపీ స్థానాలు సాధించాలనే లక్ష్యంతో కార్యాచరణకు సిద్ధమవుతోంది. అభ్యర్థుల ఎంపిక నుంచి పార్టీ ఇన్‌ఛార్జుల నియామకం వరకు పక్కాగా వ్యవహరించనుంది. వీలైనంత త్వరగా అభ్యర్థులను ప్రకటించాలని అంతకంటే ముందే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టాలని పార్టీ నిర్దేశించుకుంది. ఇప్పటికే వికసిత భారత్ పేరిట కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రత్యేక కార్యక్రమం అమలు చేస్తోంది. కేంద్ర పథకాల లబ్ధిదారుల జాబితా ఆధారంగా ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసేందుకు మరో ప్రణాళిక సిద్ధంచేస్తోంది.
BJP Parliament Elections 2024 : దశలవారీగా ప్రచార కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించిన బీజేపీ నాయకులు ప్రతి ఓటరును చేరుకునేలా పార్టీ అనుబంధ విభాగాలకు లక్ష్యాన్ని నిర్దేశించనున్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని రానున్న 20 రోజులు ఆ అంశంపై ప్రధాన దృష్టి సారించాలని నిర్ణయించారు. 17 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై బీజేపీ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. ఆశావహులతో పాటు తటస్థంగా ఉన్నవారిని, కొత్త అభ్యర్థులను గుర్తించేందుకు కీలకనేతలు దృష్టి సారించారు.
BJP Focus on Lok Sabha elections 2024 : ముచ్చటగా మూడోసారి కమలం వికసించేనా..!
Lok Sabha Elections 2024 : గెలిచే అవకాశాలున్న స్థానాల్లో అన్ని సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని కొత్తవారికైనా ప్రాధాన్యమివ్వాలని భావిస్తున్నారు. సిట్టింగ్ ఎంపీలున్న సికింద్రాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ మినహా మిగిలిన స్థానాల అభ్యర్థిత్వాల కోసం పలువురు పోటీపడుతున్నారు. ఒత్తిళ్లకు తలొగ్గకుండా సర్వేల ఆధారంగా బలమైన అభ్యర్థులను గుర్తించాలని అగ్రనేతలు నిర్ణయించారు. మల్కాజిగిరికి గట్టిపోటీ ఉంది. పలువురు పార్టీ నేతలతో పాటు కొత్తవారు ఆ స్థానం కోసం పోటీపడుతున్నారు. ఇక్కడ అభ్యర్థి ఎంపికకు జాతీయ, రాష్ట్ర నాయకత్వాలు అత్యంత ప్రాధాన్యమిస్తున్నాయని కీలకనేత ఒకరు తెలిపారు.
పార్లమెంట్ ఎన్నికల్లో విజయకేతనమే లక్ష్యం - రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల 'హస్త'గతం దిశగా కసరత్తులు
మల్కాజిగిరి లోక్‌సభ స్థానం కీలకం : నగరంతో ముడిపడి ఉండటంతో పాటు పలు అనుకూలాంశాలు మల్కాజిగిరి లోక్‌సభ స్థానంలో ఉన్నాయని భవిష్యత్‌కు అది కీలక స్థానం అవుతుందన్నారు. ఇదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల్లో నష్టం కలిగించిన అంశాలపై పార్టీ పూర్తిస్థాయిలో సమీక్షిస్తోంది. అభ్యర్థుల ప్రకటనలో జాప్యం, ఎన్నికల ప్రచారం మొక్కుబడిగా సాగడం ఫలితాలను ప్రభావితం చేసిందని గుర్తించింది. బీజేపీ వాణిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో ఉదాసీనంగా వ్యవహరించడం ఓట్ల శాతాన్ని గణనీయంగా తగ్గించిందని విశ్లేషణలో వెల్లడైంది.
అంకిత భావంతో పనిచేసేవారికే : ఉత్తర తెలంగాణలో గెలిచేందుకు మరింత అవకాశమున్నా పలు నియోజకవర్గాల్లో స్థానిక నాయకత్వం చిత్తశుద్ధితో పనిచేయలేదని ఫిర్యాదులొచ్చాయి. లోక్‌సభ ఎన్నికలకు ముందే ఆ సమస్యలు అధిగమించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పార్టీకి నష్టంచేసిన అంశాలను నియోజకవర్గాలవారీగా గుర్తించే పనిమొదలుపెట్టారు. వాటి ఆధారంగా కొందరిపై చర్యలకు సిద్ధమవుతోంది. అంకిత భావంతో పనిచేసేవారికి ప్రాధాన్యం ఉంటుందనే సందేశాన్ని స్పష్టంగా పంపాలని నిర్ణయించింది.
కాంగ్రెస్ 'విరాళాల' బాట- లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధం- పార్టీ ఆవిర్భావం రోజునే!
లోక్‌సభ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ - తెలంగాణ రాష్ట్ర నూతన ఇంఛార్జ్‌గా దీపా దాస్‌మున్షీ