ఘాన్సీబజార్, పురానపూల్లో రీపోలింగ్ జరపాలన్న భాజపా అభ్యర్థుల వినతిపై ఓట్ల లెక్కింపునకు ముందే తగిన నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. రెండు డివిజన్లలో భారీగా బోగస్ ఓటింగ్ జరిగిందని... రీపోలింగ్‌కు ఆదేశించాలని కోరుతూ భాజపా అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.
ఈనెల 1, 2 తేదీల్లో రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది వివరించారు. స్పందించిన ఉన్నత న్యాయస్థానం ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభించే లోపు.. అభ్యర్థుల వినతిపత్రాలపై చట్టప్రకారం తగిన నిర్ణయం తీసుకొని ఉత్తర్వులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ చదవండి : ఏర్పాట్లు పూర్తి.. మొదటి ఫలితం వెలువడేది అక్కడే!