ఏకాభిప్రాయం కుదిరిన 19 జిల్లాలకు భాజపా నూతన అధ్యక్షులను ప్రకటించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సూచనతో ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి అధ్యక్షుల జాబితాను ప్రకటించారు. ఈ ఎన్నిక తక్షణమే అమల్లోకి వస్తోందని తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లాకు పాయల్ శంకర్, మంచిర్యాలకు వీరబెల్లి రఘునాథ్‌రావు, నిర్మల్ పడకంటి రమాదేవి, కుమ్రంభీం ఆసిఫాబాద్ జేబీ.పౌడేల్, నిజామాబాద్ బస్వాపురం లక్ష్మీనారాయణ, కరీంనగర్ బసా సత్యనారాయణ రావు, పెద్దపల్లి సోమారపు సత్యనారాయణ, సంగారెడ్డి నరేందర్ రెడ్డి, రంగారెడ్డి బొక్క నరసింహా రెడ్డిని నూతన జిల్లా అధ్యక్షులుగా ప్రకటించారు.
అలాగే నల్గొండ జిల్లాకు కంకణాల శ్రీధర్ రెడ్డి, యాదాద్రి భువనగిరి పీవీ. శ్యాంసుందర్‌రావు, నాగర్ కర్నూల్ ఏ. సుధాకర్‌రావు, జోగులాంబ గద్వాల్ రాంచంద్రారెడ్డి, నారాయణపేట పీ.శ్రీనివాసులు, వరంగల్ పట్టణం రావు పద్మ, వరంగల్ గ్రామీణం కొండేటి శ్రీధర్, జయశంకర్ భూపాలపల్లి కన్నం యుగదీశ్వర్, జనగాం ఆరుట్ల దశమంత్ రెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం కోనేరు సత్యనారాయణ నూతన జిల్లా అధ్యక్షులని తెలిపారు.
ఇవీ చూడండి: తెలంగాణ బడ్జెట్ కేటాయింపులు ఇవే..