అయోధ్య రామ మందిర విరాళాలపై కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు చేసిన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని భాజపా నేత ఓం ప్రకాష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్లో ఆ పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. బషీర్బాగ్ కూడలిలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
తెరాస ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదని ఓం ప్రకాష్ అన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకి కేటీఆర్ కృతజ్ఞతలు