ETV Bharat / state

ఏపీ మంత్రి కొడాలి నానిని బర్తరఫ్​ చేయాలి: భాజపా

author img

By

Published : Sep 25, 2020, 4:42 AM IST

ఏపీ మంత్రి కొడాలి నానిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని భాజపా తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. ప్రధాని నరేంద్రమోదీ, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నానిని కఠినంగా శిక్షించాలని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

BJP demands ouster of Kodali from Cabinet
ఏపీ మంత్రి కొడాలి నానిని బర్తరఫ్​ చేయాలి: భాజపా

ప్రధాని నరేంద్రమోదీ, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏపీ మంత్రి కొడాలి నానిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని భాజపా తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. మంత్రివర్గంలో ఉంటూ హిందూ సమాజాన్ని కించపర్చడం సహించరానిదని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

భారత రాజ్యాంగంలో వివిధ మతాలకు సముచిత స్థానం ఇవ్వటమే కాకుండా అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని కఠినంగా శిక్షించే విధంగా నిబంధనలు, చట్టాలున్నాయని తెలిపారు. కొడాలి నానిని మంత్రి వర్గం నుంచి బర్తరఫ్‌ చేయడంతో పాటు ఆయనను చట్టపరంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

ఇవీ చూడండి: 'కేసీఆర్ కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చే విధంగా వ్యవహరిస్తున్నారు'

For All Latest Updates

TAGGED:

bjp
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.