ETV Bharat / state

"మున్సిపల్ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరాలి" - bjp meeting hyderabad

భాజపా రాష్ట్ర కార్యాలయంలో పదాధికారులతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ సమావేశమయ్యారు. మున్సిపల్ ఎన్నికలు, పోలింగ్​బూత్ కమిటీలు, మండల, జిల్లా కమిటీలు, సభ్యత్వం తదితర అంశాలపై చర్చించారు.

BJP CORE COMMITTEE MEETING ON BOOTH LEVEL COMMITTEES
author img

By

Published : Nov 3, 2019, 7:36 PM IST

బూతు స్థాయి కమిటీలపై రాష్ట్ర భాజపా కసరత్తు...

ఈ నెల 6వ తేదీలోపు 50 శాతం మండల కమిటీలు పూర్తి చేయాలని పదాధికారులకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ సూచించారు. హైదరాబాద్​లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో పదాధికారులతో లక్ష్మణ్ సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ రాంచందర్ రావు, ప్రేమేందర్​రెడ్డి, సంకినేని వెంకటేశ్వర్లు, విజయరామారావు, రవీంద్రనాయక్, చింతా సాంబమూర్తి సమావేశానికి హాజరయ్యారు. మున్సిపల్ ఎన్నికలు, పోలింగ్​బూత్ కమిటీలు, మండల, జిల్లా కమిటీలు, సభ్యత్వం అంశాలపై ప్రధానంగా సమావేశంలో చర్చించారు. ఇప్పటికే 34వేల బూత్ కమిటీలకు 14 వేలు పూర్తి కాగా... మిగిలిన 21 వేల కమిటీలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. దేశ వ్యాప్తంగా నవంబర్ చివరి వరకు జిల్లా కమిటీలు పూర్తి చేయాలని జాతీయ నాయకత్వం ఆదేశించినట్లు పార్టీ నేతలకు లక్ష్మణ్​ తెలిపారు. ఈ నెల 6న సంస్థాగత ఎన్నికలపై సమీక్షించేందుకు రాధామోహన్ సింగ్ వస్తున్నారని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగిరేలా పార్టీ శ్రేణులను సిద్ధం చేయాలని నేతలకు సూచించారు.

ఇవీ చూడండి: 'విధులకు హాజరయ్యే ఆర్టీసీ ఉద్యోగుల భద్రత మాదే'

Tg_hyd_43_03_bjp_core_commitee_meeting_av_3182061 రిపోర్టర్: జ్యోతికిరణ్ కెమెరామెన్: రమణ మహేష్ Note: feed from bjp office ofc ( ) మండల కమీటీలను ఈ నెల 6 వరకు యాభై శాతంకుపైగా పూర్తి చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పదాధికారులకు సూచించారు. హైదరాబాద్ భాజపా రాష్ట్ర కార్యాలయంలో పదాధికారులతో లక్ష్మణ్ సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ రాం చందర్ రావు, ప్రేమేందర్ రెడ్డి, సంకినేని వెంకటేశ్వర్లు, విజయ రామారావు, రవీంద్ర నాయక్, చింతా సాంబమూర్తి సమావేశానికి హాజరయ్యారు. మున్సిపల్ ఎన్నికలు, పోలింగ్ బూత్ కమిటీలు, మండల, జిల్లా కమిటీలు, సభ్యత్వం అంశాలపై ప్రధానంగా సమావేశంలో చర్చిస్తున్నారు. ఇప్పటికే 34వేల బూత్ కమిటీలకు 14 వేలు పూర్తి అయ్యాయని... మిగిలిన 21వేల కమిటీలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. దేశ వ్యాప్తంగా నవంబర్ చివరి వరకు జిల్లా కమిటీలు పూర్తి చేయాలని జాతీయ నాయకత్వం చెప్పినట్లు లక్ష్మణ్ పార్టీ నేతలకు తెలిపారు. ఈ నెల 6న సంస్థాగత ఎన్నికలపై సమీక్షించేందుకు రాధామోహన్ సింగ్ వస్తున్నారని తెలిపారు. అప్పటిలోగా సగంపైగా మండల కమిటీలు పూర్తి చేయాలని ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరేలా పార్టీ శ్రేణులను సిద్ధం చేయాలని నేతలకు సూచించారు........Vis
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.