BJP Charge Sheet on BRS Govt in Telangana 2023 : పోరాడి సాధించుకున్న తెలంగాణలో బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారని... బీజేపీ ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. ఇసుక, గ్రానైట్, ల్యాండ్, డ్రగ్, లిక్కర్, కాంట్రాక్ట్ మాఫియా అన్నింట్లో బీఆర్ఎస్ నాయకులకు సంబంధాలున్నాయని ఆరోపించింది. ప్రతి పథకంలో కమీషన్లు వసూలు చేస్తున్నట్లు ఆరోపించింది. ముఖ్యమంత్రి కుమార్తె కవితకు దిల్లీ మద్యం కుంభకోణంలో సంబంధాలున్నట్లు దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయని ఛార్జ్ షీట్‌లో వెల్లడించింది. ధరణి పోర్టల్.. బీఆర్ఎస్ నాయకులకు ఏటీఏంగా మారిందని ఆరోపించారు. అ
BJP Slams KCR Government : మరుల త్యాగాలతో వచ్చిన తెలంగాణ.. కుటుంబపరమైందని బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇంఛార్జ్... ప్రకాశ్ జవడేకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రవాద మూలాలపైనా జావడేకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరైనా అవినీతికి పాల్పడితే.. 040-23452933 నంబర్‌కు కాల్ చేయాలని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ సభలో ప్రకటించినా ఆ నంబర్ మనుగడలోనే లేదని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతును రాజును చేస్తానని చెప్పారని.. స్వరాష్ట్రంలో తొమ్మిదిన్నరేళ్లలో 7,800 మంది రైతుల ఆత్మహత్య చేసుకున్నారని ఛార్జ్‌షీట్‌లో ప్రస్తావించారు. ఏకకాలంలో రుణమాఫీ జరగలేదని, సాగుకి 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నామనేది వాస్తవం కాదని బీజేపీ పేర్కొంది.
42 మందితో బీజేపీ ప్రచారకర్తల జాబితా విడుదల, చర్చల అనంతరం విజయశాంతి, రఘునందన్ రావు పేర్లు
"నిజం ఎప్పుడు బయటకు రావాలో అప్పుడే వస్తుంది. ఇన్ని సంవత్సరాలుగా లేనిది ఎన్నికల ప్రచార సమయంలో ఇలా అయ్యింది. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి దేశమే కాదు.. ప్రపంచమంతా మాట్లాడుకుంటోంది. కేసీఆర్ అవినీతి అంతా ఈ ఒక్క ప్రాజెక్టుతో బయటపడింది." - మురళీధర్‌రావు, బీజేపీ ఛార్జ్‌షీట్ కమిటీ ఛైర్మన్
దళిత ముఖ్యమంత్రి హామీ నుంచి మొదలు దళితులకు 3 ఎకరాల భూమి, దళిత బంధు వరకు ఇలా అన్ని విషయాల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రజలను దగా చేసిందని బీజేపీ ఆరోపించింది. బీసీల సమగ్ర అభివృద్ధి కోసం రూ.25 వేల కోట్లు ఖర్చుచేస్తామని చెప్పి వారికి ద్రోహం చేశారని ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి కళ్లముందే కనిపిస్తోందని.. బీజేపీ ఛార్జ్‌షీట్ కమిటీ ఛైర్మన్ మురళీధర్‌రావు ఆరోపించారు.
ఊపందుకున్న ఎన్నికల ప్రచారం ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో అభ్యర్థులు
ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. కనీసం ఊరికొక ఉద్యోగం ఇవ్వలేదని.. అదే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని కమలం పార్టీ నిర్ణయించింది. 2018 ఎన్నికల మేనిఫెస్టోలో నిరుద్యోగులకు రూ.3వేల 16 భృతి ఇస్తానని... మోసం చేశారని పేర్కొంది. జీహెచ్ఎంసీని విశ్వనగరంగా కాకుండా విషాద నగరంగా మార్చారని ఆరోపించింది. కాలుష్యం, వరద సమస్యలు, మురికివాడలు లేని నగరంగా తీర్చిదిద్దుతాననని మోసం చేశారని బీజేపీ మండిపడింది.
BJP Charge Sheet on KCR Govt : తెలంగాణ స్ఫూర్తికి విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారు. కేంద్రానికి సహకరించలేదు. కుటుంబమే అంతా పాలనచేసింది. మద్యం, మత్తుపదార్ధాలు, ఉగ్రవాదం పెరిగాయి. ఇదే ఈసర్కారు కథ అంతా. ఉగ్రవాదానికి సంబంధించి.. ఎన్‌ఐఏ కొంతమందిని గుర్తించి అరెస్టు చేసింది. ఇప్పుడు, గతంలోనూ ఇక్కడ చాలా ఉగ్ర మూలాలు లభ్యమయ్యాయి. పీఎఫ్‌ఐ సహా ఇతర ప్రమాదకర సంస్థల ఆనవాళ్లు గుర్తించారు. తెలంగాణలో తీవ్రవాదంపై మొగ్గుతున్న యువత కనిపిస్తున్నారు. ఇవే మా ఛార్జ్‌షీట్‌లో పెట్టాం.
ప్రపంచంలో అతిపెద్ద అవినీతి ప్రాజెక్టుగా కాళేశ్వరం నిలిచిపోనుంది : బీజేపీ నేతలు
'తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగానే చంద్రబాబు పోటీకి దూరం'