జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో చివరి రోజు కావడంతో అభ్యర్థులు జోరు పెంచారు. బేగంబజార్ డివిజన్ భాజపా అభ్యర్థి శంకర్ యాదవ్.. గెలుపే లక్ష్యంగా ప్రచారాన్ని కొనసాగించారు. డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ.. కమలం గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు.
20 ఏళ్లుగా ఈ ప్రాంతంలో ప్రజలకు సేవ చేస్తున్నానని... మరో అవకాశం ఇవ్వాలని అభ్యర్థి కోరారు. కోట్ల రూపాయాలు ఖర్చు పెట్టి... తెరాస నాయకుడు నందు బిలాల్ తన కుమార్తెను గెలిపించుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని డబ్బుతో కొనేసి... పోటీలో లేకుండా చేశారని ఆరోపించారు. డబ్బుతో ప్రజలను లొంగదీసుకొని గెలవాలని చూస్తున్నారని, ప్రజల అండ తనకు ఉందని అన్నారు. ఎన్నికల్లో ప్రత్యర్థులని చిత్తు చిత్తుగా ఓడిస్తానని శంకర్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు చేసిన అమిత్ షా