పర్యావరణ పరిరక్షణే మానవ జీవన సంరక్షణ అని... రాష్ట్ర జీవ వైవిధ్య మండలి కార్యదర్శి కాళీ చరణ్ అన్నారు. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవ వేడుకలను వర్చువల్గా నిర్వహించారు. వేడుకలను పురస్కరించుకొని పెయింటింగ్, ఫోటోగ్రఫీ, వంటి 9 విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో... దాదాపు 5,600 మంది పాల్గొన్నారని చెప్పారు.
అందరూ కలిసి జీవ వైవిధ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరికి జీవవైవిధ్య పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు రచ్చబండ కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ అరణ్య భవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రచ్చబండ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఇదీ చదవండి: వైరల్: మితిమీరిన వేగం- ఎగిరి పడ్డ ట్రక్కు