BioAsia Summit 2023: వచ్చేనెల 24 నుంచి 26 వరకు హైదరాబాద్ మాదాపూర్ వేదికగా బయో ఏసియా 20వ సదస్సును రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది. ఈ అంతర్జాతీయ సదస్సుకు 200 మందికిపైగా ప్రపంచ ప్రసిద్ధ శాస్త్రవేత్తలు సంస్థల అధిపతులు, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు పాల్గొంటారని మంత్రి కేటీఆర్ తెలిపారు. సదస్సుకు హాజరయ్యే ప్రముఖుల జాబితాను ఆయన విడుదల చేశారు.
గత 20 ఏళ్లుగా నిర్వహిస్తున్న సదస్సు రాష్ట్రంలో ఔషధ, జీవశాస్త్రాల అభివృద్ధికి దోహదపడిందని.. అదే స్ఫూర్తితో ఈసారి జరుపుతున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. కొవిడ్ అనంతరం.. బయో పారిశ్రామిక రంగం అవసరం మరింత పెరిగిందని మానవీకరించిన ఆరోగ్య సంరక్షణ తదుపరి తరాన్ని రూపొందించడం అనే నినాదంతో ఈసారి సదస్సు జరగనుందని నిర్వాహకులు తెలిపారు.
ఇవీ చదవండి: