ETV Bharat / state

అధికారుల నిర్లక్ష్యంతో... జనావాసాల్లో బయోత్పాతం

జీహెఎంసీ, కాలుష్య నియంత్రణ మండలి అధికారుల నిర్లక్ష్యంతో జీవ వ్యర్థాలు జనావాసాల్లోకి చేరుతున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రత వద్ద బూడిద కావాల్సిన సిరంజీలు, ఇతర వ్యర్థాలు.. తుక్కు గోదాముల్లో కనిపిస్తున్నాయి. ఎక్కడి నుంచి సేకరిస్తున్నారంటే యజమానులు జవాబు చెప్పట్లేదు. కొవిడ్‌ వ్యర్థాల నిర్వహణపైనా అదే ఆందోళన రేకెత్తుతోంది. ఓ వైపు పౌరులు నిర్లక్ష్యంగా మాస్కులు, గ్లౌజులను రోడ్లపై వేస్తుంటే.. మరోవైపు వ్యాధిగ్రస్థుల ఇళ్లలో ఉత్పత్తయ్యే చెత్తనూ జీహెచ్‌ఎంసీ అధికారులు మామూలు చెత్తతో కలిపి సేకరిస్తున్నారు. వెరసి వ్యర్థాల నిర్వహణ ప్రమాదకరంగా తయారైందన్న విమర్శలొస్తున్నాయి.

Bio-waste, warehouses
జనావాసాల్లో బయోత్పాతం..!
author img

By

Published : May 10, 2021, 8:36 AM IST

మూసాపేటలో జోరుగా దందా..

మూసాపేట గూడ్స్‌షెడ్డు రోడ్డులో చాలా ఏళ్లుగా జీవ వ్యర్థాల దందా సాగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. నాలాకు ఆనుకుని ఉన్న గోదాములో, వాడేసిన సిరంజీలు, సెలైన్‌ బాటిళ్లు, తదితర వ్యర్థాలను కుప్పలుగా పోసి.. లారీల్లో తీసుకెళ్తుంటారు. అవి ఆస్పత్రుల నుంచి వస్తున్నాయి. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా యజమాని వ్యర్థాలను తీసుకురావడం ఆపట్లేదు. ఫిర్యాదుదారులను బెదిరింపులకు గురిచేస్తున్నారు. ఇటీవల మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి కూడా తనిఖీ చేసి, హెచ్చరించి వెళ్లారు. అయినా యజమాని స్పందించట్లేదు. కొవిడ్‌ చికిత్సకు ఉపయోగించేవాటిని ఇక్కడకు తరలిస్తున్నట్లు అనుమానం ఉంది. వాటిని నాలా పక్కనే కుప్పగా పోశారు. వర్షం వచ్చినప్పుడు కొద్దికొద్దిగా నాలాలో కలుస్తున్నాయి.’’అని స్థానికులు ‘ఈనాడు’కు తెలిపారు. యజమాని వి.నిరంజన్‌రావును వివరణ కోరితే.. రెండు, మూడు రోజుల్లో తరలిస్తానన్నారు. ఎందుకు తీసుకొచ్చారు, వాటిని ఏం చేస్తారు, ఎన్నాళ్లుగా వాటిని సేకరిస్తున్నారనే ప్రశ్నలకు సమాధానం లేదు. నిరంజన్‌రావుతోపాటు గూడ్స్‌షెడ్డు రోడ్డులో మరికొందరు ఇలాంటి వ్యర్థాలను సేకరించి మార్కెట్లో విక్రయిస్తున్నారని, పటాన్‌చెరు, జీడిమెట్ల, కాటేదాన్‌ వంటి ప్రాంతాల్లోనూ ఈ తరహా వ్యాపారాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.

బీజేఆర్‌నగర్‌లో..

సిరంజీలు, రక్తమార్పిడి పైపులు, నిల్వ ప్యాకెట్లు, గ్లూకోజు సీసాలు, పైపులు, ఇతరత్రా ఆస్పత్రి వ్యర్థాలు కొన్నేళ్లుగా ఖైరతాబాద్‌ బీజేఆర్‌నగర్‌లోని పాత కల్లు కాంపౌండ్‌కు చేరుతున్నాయి. వ్యాపారి వాటిని ఆస్పత్రుల నుంచి సేకరించి, కూలీలతో వేర్వేరు సంచుల్లో నింపుతారు. ఈ క్రమంలో కూలీల చేతులకు సిరంజీలు గుచ్చుకోవడం, ఇతరత్రా ప్రమాదాలు జరుగుతుంటాయని స్థానికులు చెబుతున్నారు. చెత్త వ్యవహారం గురించి స్థానిక బల్దియా అధికారులకు, నేతలకు తెలిసినప్పటికీ ఎవరూ నోరు మెదపట్లేదని గగ్గోలు పెడుతున్నారు.

ఓ గోడౌన్‌లో సిరంజీలు, జీవ వ్యర్థాలు

అధ్వానంగా కొవిడ్‌ వ్యర్థాల నిర్వహణ..

కొవిడ్‌ మొదటి దశ వ్యాప్తి సమయంలో జీహెచ్‌ఎంసీ ఇంటింటి వ్యర్థాల సేకరణను పక్కాగా చేపట్టింది. ఇప్పుడు అలాంటి జాగ్రత్త తీసుకోవట్లేదు. కొవిడ్‌ వ్యాధిగ్రస్తులు ఉన్న ఇంట్లో ఉత్పత్తయ్యే చెత్తను అన్ని ఇళ్లతో కలిపి తీసుకెళ్తున్నారు. దీని వల్ల చెత్త సేకరణ కార్మికులు, డంపింగ్‌ యార్డులోని కార్మికులు రోగాల బారినపడతారు. వైరస్‌ వ్యాప్తి పెరుగుతుంది. ఉపయోగించిన మాస్కులు, గ్లౌజులను రోడ్లపై వేస్తోన్న పౌరుల కారణంగానూ పారిశుద్ధ్య కార్మికులు అనారోగ్యానికి గురవుతున్నారు. పరిస్థితులను గమనించి ఉన్నతాధికారులు తమకు రక్షణ వస్తువులు ఇవ్వాలని కార్మికులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: పల్లెలను కబళిస్తున్న కరోనా మహమ్మారి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.