హైదరాబాద్ సరూర్ నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో కొందరు గుట్టు చప్పుడు కాకుండా పేకాట ఆడుతున్నారు. సమాచారం తెలుసుకున్న రాచకొండ కమిషనరేట్ ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు పేకాట స్థావరాలపై దాడులు చేపట్టారు. తొమ్మిది మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి నుంచి 9ఫోన్లు, రూ.29 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి దర్యాప్తు కోసం వారిని సరూర్ నగర్ పోలీసులకు అప్పగించారు.
ఇదీ చూడండి: రోడ్లపైకి భారీగా వలస కార్మికులు- పోలీసుల లాఠీఛార్జ్