ETV Bharat / state

రక్షక భటుల నిలయంలోనే రక్షణ లేకపోతే!

ఏదైనా పోగొట్టుకుంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. కానీ... పోలీస్​ స్టేషన్​లో ఉన్న వాహనమే చోరీ అయితే ఎవరికి చెప్పాలి? రక్షక భటుల నిలయానికే రక్షణ లేకుండా పోతే ఇక సాధారణ ప్రజల సంగతేంటి?

పోలీస్​ స్టేషన్​లో బైక్​ చోరీ
author img

By

Published : Apr 4, 2019, 10:01 PM IST

రక్షక భటుల నిలయంలోనే రక్షణ లేకపోతే!
మద్యం సేవించి డ్రైవింగ్​ చేసే వారి నుంచి వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని, కౌన్సిలింగ్​ ఇవ్వటం పరిపాటి. ఇటీవల డ్రంక్​ అండ్ డ్రైవ్​లో ఓ యువకుడి ద్విచక్రవాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కౌన్సిలింగ్​ ఇచ్చి, కోర్టులో అపరాధ రుసుం చెల్లించిన తర్వాత తమ బైక్​ను తీసుకోవడానికి వచ్చిన ఆ యువకుడిని నెలరోజులుగా స్టేషన్​ చుట్టూ తిప్పిస్తున్నారు.

బైక్​ పోయింది :

అన్ని పోలీస్​ స్టేషన్లు తిరిగిన యువకుడు చివరగా టోలీచౌకీ ఠాణాలో సంప్రదించగా... ఆ ద్విచక్ర వాహనం పోయిందని... దొరికితే ఇస్తామని పోలీసులు సమాధానం ఇచ్చారు. సీసీటీవీ ఫుటేజీలో నిందితులను గుర్తించామని చెబుతున్నారు. తన బైక్​ ఇవ్వడం లేదని యువకుడు ఆవేదన చెందాడు. రోజు ఉద్యోగానికి ద్విచక్రవాహనంపై వెళ్లేవాడినని, ఇప్పుడు బైక్​ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందిగా ఉందని తెలిపాడు.

ఇవీ చూడండి:ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి, ఎంపీటీసీ

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.