ప్రస్తుతం రోజుకో మోడల్ బైకు మార్కెట్లోకి వస్తున్న కాలమిది. అన్ని కంపెనీల లక్ష్యం యువతను ఆకట్టుకోవడమే. మైలేజ్, స్పీడ్‌తో పాటు చూడగానే మనసు దోచేలా ఉండాలని నేటితరం కోరుకుంటోంది. అలా లేకుంటే వారి నోట వచ్చేపదం రీమోడలింగ్. అలాంటి వారికోసమే ఏర్పాటైన సంస్థ ఉమెనియోటెరిక్. సరికొత్త డిజైన్లతో వాహనాలకు కొత్త అందాలు అద్దుతూ ప్రత్యేకత చాటుతున్నారు హైదరాబాద్‌కు చెందిన సత్యవాణి, సంగీత.
జీవితాన్నే పెయింటింగ్‌గా...
టెన్నిస్ క్రీడాకారిణి అయిన అక్క సత్యవాణికి జరిగిన ప్రమాదమే ఈ ఆలోచనకు కారణమంటోంది ఉమెనియోటెరిక్ వ్యవస్థాపకురాలు సంగీత. సత్యవాణిలో మానసిక స్థైర్యం నింపడానికి ఓ బైక్‌ను సంగీత, ఆమె తల్లి కానుకగా అందించారు. వినూత్నంగా ఆలోచించిన సంగీత బైక్‌పై తన అక్క జీవితాన్నే పెయింటింగ్‌గా వేశారు. తోటివారూ తమకు అలాంటి పెయింటింగ్ కావాలని కోరడంతో... ఆ పనినే వృత్తిగా మార్చుకున్నారు.
త్రీడీ టెక్నాలజీ వాడుతున్న తొలి మహిళలు...
బైక్వీల్స్, ట్యాంక్స్, హెల్మెట్స్ ఇలా అన్నిటీపైనా తమదైన రీతిలో పెయింటింగ్ చేస్తూ ఫిదా చేస్తున్నారు. వీరి కళను గుర్తించిన రాయల్ ఎన్ ఫీల్ఢ్ సంస్థ తమ వాహనాలకు వారి ఆకృతులను తీసుకుంటోంది. బైక్ మాడిఫైయింగ్కు త్రీడీ టెక్నాలజీ వాడుతున్న తొలి మహిళలు వీరే కావడం విశేషం.
అనుకోని విధంగా విభిన్న రంగంలో అడుగుపెట్టి...సృజనాత్మకతతో ఆలోచించి అద్భుతాలు సృష్టిస్తోన్న వీరి జీవితం ఎందరికో స్ఫూర్తి దాయకం.
ఇదీ చూడండి: కాళేశ్వరం పనుల పురోగతిపై సీఎం కేసీఆర్ సమీక్ష