ట్యాంక్‌బండ్‌పై బైక్ ఢీ... ఎగిరిపడ్డ ముగ్గురు హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ నెల 23 తెల్లవారు జామున రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. ఈ సంఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు రాణిగంజ్ వైపు వెళ్లేందుకు ట్యాంక్‌బండ్ పైన దాటుతుండగా... రాణిగంజ్ వైపు నుంచి లిబర్టీ వైపు వేగంగా వెళ్తున్న మరో ద్విచక్ర వాహనదారుడు అదుపుతప్పి ఢీ కొట్టాడు.
రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని కిందపడిపోవడం వల్ల ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం వారు ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని గాంధీ నగర్ పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
ఇవీ చూడండి: ఎర్రబెల్లి కాన్వాయి వాహనం బోల్తా.. ఇద్దరు దుర్మరణం