Big Twist in Ex MLA Shakeel Son Accident Case : హైదరాబాద్ ప్రజాభవన్ ముందు ఈ నెల 23న కారు బీభత్సం సృష్టించిన కేసులో, కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రమాదానికి బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ కారణమని ఇప్పటికే పోలీసులు తెలిపినప్పటికీ, ప్రస్తుతం నిందితుడిని(Accused) తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. తన బదులు ఇంట్లో పనిచేసే మరొకరు కారు నడిపినట్టు చూపించాలని యత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
చెరువులోకి దూసుకెళ్లిన కారు - ప్రాణాలతో బయటపడిన నలుగురు, ఒకరి దుర్మరణం
ఈ కేసులో నిందితుడికి పోలీసులు సహకరించినట్లు అధికారులు గుర్తించారు. ప్రమాదం తర్వాత సాహిల్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించిన కొద్దిసేపటికే, మాజీ ఎమ్మెల్యే షకీల్ అనుచరులు వచ్చి కేసులో సాహిల్ పేరు చేర్చవద్దని కోరినట్లు తెలుస్తోంది. అనంతరం పీఎస్ నుంచి సాహిల్‌ను తీసుకెళ్లడంతో, అతడి బదులు వారింట్లో పని చేసే వ్యక్తి పేరును పోలీసులు చేర్చారు.
Ex MLA Shakeel Son Accident Case Update : నిందితుడ్ని తప్పించేందుకు జరుగుతున్న వ్యవహారంలో సీఐ, నైట్ డ్యూటీ ఎస్‌ఐ సహా ఇద్దరు కానిస్టేబుళ్ల పాత్ర ఉందన్న అనుమానంతో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరా దృశ్యాల(CCTV Camera Footage) ఆధారంగా విచారణ వేగవంతం చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. గతంలో కూడా కారుతో విధ్వంసం సృష్టించి రాహిల్ ఒకరి మరణానికి కారణమయ్యాడని డీసీపీ పేర్కొన్నారు.
అసలేం జరిగిందంటే : ఈనెల 23వ తేదీన వేకువజాము 3 గంటల సమయంలో హైదరాబాద్ ప్రజా భవన్ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. ప్రజా భవన్ ఎదుట ఉన్న ట్రాఫిక్ బారికేడ్లపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బారికేడ్లు పూర్తిగా ధ్వంసం కాగా వాహనం మితిమీరిన వేగానికి కారు(Car wreck) ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ప్రమాదం జరిగిన సమయంలో కారు ఆగగానే అందులో నుంచి ఒకరు పరారయ్యారు. ఘటనలో అప్రమత్తమైన పోలీసులు అక్కడికి చేరుకుని వాహనంలో ఉన్న మిగిలినవారిని అదుపులోకి తీసుకున్నారు.
నాలుగు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ - బిహార్ రాబిన్‌హుడ్ తెలంగాణలో అరెస్ట్
నిందితులను పంజాగుట్ట పీఎస్‌కు తరలించారు. బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే షకిల్ కుమారుడు సాహిల్ ఈ విధ్వంసం సృష్టించినట్లు తెలిసింది. అయితే పోలీస్ స్టేషన్ నుంచి అతడు తప్పించుకోవడంతో నిందతుడు కావాలనే తప్పిపోయాడా లేక ఎవరైనా తప్పించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. పరారీలో ఉన్న సాహిల్ కోసం గాలిస్తున్నారు.
ప్రజాభవన్ వద్ద కారుతో మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి హల్చల్ - నిందితుడి కోసం పోలీసుల గాలింపు
పిల్లలు లేని కుమార్తె కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన మహిళ - ఆరు గంటల్లోనే ఛేదించిన పోలీసులు