హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్ ఫ్లైఓవర్ (masab tank flyover ) పైనుంచి వెళ్తున్న కారుకు... తృటిలో ప్రమాదం తప్పింది. వంతెన ఎక్కేటప్పుడు ముందు వెళ్తున్న లారీ నుంచి పెద్ద బండరాయి జారి కారుపై పడింది. డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల ప్రాణాపాయం తప్పింది. ఇదే సమయంలో కారు టైరు పేలి వాహనం దెబ్బతింది.
డ్రైవర్ అజాగ్రత్త కారణంగా లారీలో నుంచి బండరాయి కిందపడింది. లక్డీకపూల్ నుంచి మెహదీపట్నం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. వంతెనపై బండరాయి పడడంతో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
ఇదీ చూడండి: Pornographic content : '48 శాతం విద్యార్థులు ఇంటర్నెట్లో అవే చూస్తున్నారు'