ETV Bharat / state

Bibi-Ka-Alam: ఘనంగా బీబీ-కా-ఆలం ఊరేగింపు.. రక్తం చిందించిన షియాలు - moharram festival news

హైదరాబాద్ పాతబస్తీలో బీబీ-కా-ఆలం ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. భారీ సంఖ్యలో షియా ముస్లిం సోదరులు రక్తాన్ని చిందిస్తూ సంతాపాన్ని తెలియజేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ చర్యలు తీసుకున్నారు.

Bibi-Ka-Alam: పాతబస్తీలో మొదలైన బీబీ-కా-ఆలం ఊరేగింపు

author img

By

Published : Aug 20, 2021, 3:16 PM IST

Updated : Aug 20, 2021, 7:10 PM IST

హైదరాబాద్ పాతబస్తీలో బీబీ-కా-ఆలం ఊరేగింపు ఘనంగా జరిగింది. మొహర్రం సంతాప దినంలో భాగంగా డబీర్‌పురాలోని బీబీ-కా-ఆలం నుంచి అంబారిపై బయలుదేరిన బీబీ-కా-ఆలం ఊరేగింపు.. చార్మినార్‌ మీదుగా సాగింది. భారీ సంఖ్యలో షియా ముస్లిం సోదరులు... కత్తులు, బ్లేడ్లతో తమ శరీరాన్ని గాయపరుచుకుని రక్తాన్ని చిందిస్తూ సంతాపాన్ని తెలియజేశారు.

Bibi-Ka-Alam: పాతబస్తీలో రక్తం చిందిస్తున్న షియాలు

చార్మినార్ వద్ద బీబీ-కా-ఆలం చూసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో వచ్చారు. డబీర్​పురాలోని బీబీ-కా-ఆలం నుంచి మొదలైన ఊరేగింపు.. అలీజ కోట్ల, చార్మినార్‌, గుల్జార్​హౌజ్‌, పంజేశా, మీర్‌ఆలం మండి, దారుల్‌ శిఫ మీదుగా వెళ్లి చాదర్‌ఘాట్‌ వద్ద ముగిసింది.

మరోవైపు ఊరేగింపులో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్ నగర సీపీ అంజనీ కుమార్ చార్మినార్ వద్ద ఉండి పరిస్థితిని సమీక్షించారు. ప్రశాంత వాతావరణంలో ఊరేగింపు జరిగిందని స్పష్టం చేశారు.

త్యాగం, స్ఫూర్తికి ప్రతీక మొహర్రం..

మొహర్రం పండుగ త్యాగం, స్ఫూర్తికి ప్రతీక అని, మానవ జాతిలో త్యాగం ఎంతో గొప్పదని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. విశ్వాసం, నమ్మకం కోసం మహ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమాం హుస్సేన్ చేసిన బలిదానాన్ని గుర్తు చేసుకోవడమే మొహర్రం అని వెల్లడించారు. మంచితనం, త్యాగాన్ని గుర్తు చేసుకోవడమే ఈ వేడుకకు నిజమైన అర్థమని అన్నారు.

ఇస్లాంలో ముఖ్యమైన మానవతావాదాన్ని ప్రతిబింబించే మొహర్రం స్ఫూర్తిని అనుకరిద్దామన్నారు. త్యాగం, శాంతి, న్యాయం వంటి ఆదర్శాలు మనలో ఎప్పటికీ స్ఫూర్తి నింపుతాయని సీఎం పేర్కొన్నారు.

స్ఫూర్తిని చాటుతుంది..

మంచితనం, అంకితభావం, త్యాగాల స్మరణ ద్వారా మానవ జీవితంలోని నిజమైన స్ఫూర్తిని... మొహర్రం చాటుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli) అన్నారు. మతసారమస్యానికి ఈ పండుగ ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం పెర్కవీడులో పీరీల ఉత్సవాలు ప్రారంభించారు. మైనారిటీల అభివృద్ధికి తెరాస ప్రభుత్వం కృషి చేస్తోందన్న మంత్రి ఉద్ఘాటించారు.

త్యాగ నిరతికి ప్రతీక మొహర్రం..

త్యాగ నిరతికి ప్రతీక మొహర్రం అని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. హజ్రత్ ఇమామ్ హుస్సేన్ బలిదానాన్ని మొహర్రం గుర్తు చేస్తుందని తెలిపారు. మైనారిటీల భద్రత, సముద్ధరణకు సీఎం కృషి చేస్తున్నారని వెల్లడించారు.

ట్రాఫిక్​ ఆంక్షలు..

మొహర్రం సందర్భంగా భాగ్య నగరంలో పోలీసులు నేడు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. ప్రజలంతా పోలీసులకు సహకరించాలని నగర పోలీస్​ కమిషనర్​ అంజనీ కుమార్​ విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి: CM KCR: త్యాగం, స్ఫూర్తికి ప్రతీక మొహర్రం

Last Updated : Aug 20, 2021, 7:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.