ETV Bharat / state

ఓటమి భయంతో ఓట్లను కొంటున్నారు: కోమటిరెడ్డి - తెలంగాణ తాజా వార్తలు

ఓట‌మి భ‌యంతో అధికార పార్టీ... ఎన్నిక‌ల నియ‌మావ‌ళిని ఉల్లంఘించి ఓట్లను కొనుగోలు చేస్తోంద‌ని భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి ఆరోపించారు. తెరాస దిగ‌జారుడు రాజ‌కీయాల‌కు పాల్పడుతోంద‌ని విమ‌ర్శించారు.

ఓటమి భయంతో ఓట్లను కొంటున్నారు: కోమటిరెడ్డి

author img

By

Published : Mar 13, 2021, 7:41 PM IST

పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్​ సందర్భంగా ఓట్లు కొనుగోలు చేసి అధికార‌ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తోంద‌ని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. కులాల వారీగా ఓట్ల కొనుగోలు చేస్తూ... ప్రజ‌ల మ‌ధ్య చిచ్చుపెట్టే ప్రయ‌త్నం చేస్తోంద‌ని ఆరోపించారు. వీడియోల‌ను సుమోటోగా తీసుకుని ఎమ్మెల్యే రాములు నాయ‌క్​పై కేసు న‌మోదు చేయాల‌ని వెంక‌ట‌రెడ్డి డిమాండ్ చేశారు.

వైరా ఎమ్మెల్యే త‌న‌ క్యాంపు కార్యాల‌యంలో ఓటర్లకు డ‌బ్బులు పంచుతుండ‌గా... అడ్డుకోడానికి వెళ్లిన కాంగ్రెస్ కార్యక‌ర్తల‌పై దాడి చేసి... పోలీసులు అక్రమంగా కేసులు పెట్టారని ఆరోపించారు. ఓటమి భయంతో ఇటీవ‌ల ప్రగ‌తి భ‌వ‌న్‌లో ఉద్యోగ సంఘ‌ నేత‌ల‌తో స‌మావేశం ఏర్పాటు చేసి భారీగా పీఆర్సీ ఇస్తున్నట్లు అర‌చేతిలో వైకుంఠం చూపించార‌ని విమర్శించారు.

ఇదీ చూడండి: ఎమ్మెల్సీ ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చూడాలి: ఉత్తమ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.